అంబటి వ్యాఖ్యలకు సిద్ధం.. వస్తారా.. రమ్మంటారా : దేవినేని ఉమా

-

ఏపీ మంత్రి అంబటి రాంబాబు నిన్న పోలవరం ప్రాజెక్ట్‌ టీడీపీ నిర్ణయాల వల్లే దెబ్బతిందంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చకు సిద్దమా అంటూ సవాల్‌ విసిరారు అంబటి. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై తాము చర్చకు సిద్ధమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

Devineni Uma: పోలవరం ప్రాజెక్టుపై జగన్ నోరు విప్పాలి - NTV

కమీషన్లకు కక్కుర్తి పడి పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని, రివర్స్ టెండరింగ్ పేరుతో పనులు ఆపేసి జగన్ తీరని తప్పు చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా 2022 నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తామని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శాసనసభలో ప్రకటించారని, ఇప్పుడేమో మరో మంత్రి అంబటి మాట్లాడుతూ అది ఎప్పటి వరకు పూర్తవుతుందో తెలియదని అంటున్నారని ఎద్దేవా చేశారు దేవినేని ఉమా. పోలవరం ప్రాజెక్టుపై చర్చకు రావాలంటూ చంద్రబాబుకు సవాలు విసరడం హాస్యాస్పందంగా ఉందన్న దేవినేని ఉమా.. చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, తాడేపల్లి రావాలో లేదంటే పోలవరం ప్రాజెక్టు వద్దకు రావాలో చెప్పాలంటూ సీఎం జగన్, అంబటికి సవాలు విసిరారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం అని.. ఈ రెండింటినీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news