ఎక్సైజ్‌ శాఖ గ్రీన్ సిగ్నల్‌.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు..

-

రోజురోజుకు ఆన్‌లైన్‌ అమ్మకాలు జోరు పెరిగిపోతోంది. దీంతో మద్యం అమ్మకాలను కూడా ఆన్‌లైన్‌లో చేపట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ కంపెనీ అడుగులు వేసి ఫలితం సాధించింది. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలపై ఎక్సైజ్‌ శాఖ సైతం గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. దీంతో.. కోల్‌కతాలో ఇప్పుడు ఇంటి వద్దకే మద్యం సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ పది నిమిషాల్లోనే మద్యం డెలివరీ చేస్తోంది.

Online Sale of Liquor: Legal Angle - iPleaders

నిజానికి మద్యాన్ని డోర్ డెలివరీ చేసే సంస్థలు చాలానే ఉన్నప్పటికీ కేవలం 10 నిమిషాల్లోనే మద్యాన్ని సరఫరా చేసే సంస్థ ఇదొక్కటే. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ‘బూజీ’ బ్రాండ్ పేరుతో కోల్‌కతాలో ఈ సేవలు అందిస్తోంది. ఆన్‌లైన్ సేవలకు ఉన్న డిమాండును దృష్టిలో పెట్టుకుని ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. పశ్చిమ బెంగాల్ ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకుని ఈ సేవలు ప్రారంభించింది. మద్యాన్ని ఆర్డరు చేసిన పది నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నామని, ఇలా చేస్తున్న తొలి సంస్థ తమదేనని కంపెనీ పేర్కొంది ఇన్నోవెంట్ టెక్నాలజీస్.

Read more RELATED
Recommended to you

Latest news