బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు..ప్రజెంట్ తన ప్రొఫెషనల్ లైఫ్ లో ఫుల్ బిజీగా ఉంది. ఓ వైపు ఉమన్ సెంట్రిక్ పాన్ ఇండియా ఫిల్మ్స్ చేస్తూనే మరో వైపున పలు సినిమాల్లో ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తోంది. కాగా, తాజాగా ఆ స్టార్ హీరోతో మరో సారి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో ఆయనతో నాలుగో సారి సమంత జత కట్టనుంది.
సమంత..ప్రస్తుతం ప్యారలల్ గా పలు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నట్లు సమాచారం. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ‘ఖుషీ’ సినిమా చేస్తూనే మరో వైపున ‘యశోద’ ఫిల్మ్ షూటింగ్ లో పాల్గొంటోంది. కాగా, కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తో మరో సినిమాకు సమంత ఓకే చెప్పేసిందని వినికిడి. ‘ఖైదీ, మాస్టర్, విక్రమ్’ ఫేమ్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ తన 67వ చిత్రం చేయనున్నారు.
ఈ క్రమంలో ఆ చిత్రంలో కథానాయికగా సమంతను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. సమంత విజయ్ తో గతంలో ‘తేరి, మెర్సల్, కత్తి’ చిత్రాల్లో కథానాయికగా నటించింది. ‘తేరి’ సినిమా తెలుగులో ‘పోలీసోడు’గా విడుదల కాగా, ‘మెర్సల్’ ..‘అదిరింది’ అనే పేరుతో విడుదలైంది. సమంత నటించిన ‘శాకుంతలం’ త్వరలో విడుదల కాబోతున్నదని తెలుస్తోంది.