జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ పై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. ఆరేండ్ల పాపకు, పదహారేండ్ల అమ్మాయికి, అరవై ఏండ్ల బామ్మకు రక్షణ లేదు కేసీఆర్ రాజ్యంలో…మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగి వారం రోజులైనా నిందితులను పట్టుకునే దిక్కులేదని విమర్శించారు.
ఉన్నోనికి చట్టం చుట్టమైతే లేనోనికి న్యాయం బజార్లో దొరుకుతుందా? గ్యాంగ్ రేపులో TRS పార్టీకి చెందిన నాయకుల బంధువులు అని.. మిత్రపక్షం MLAల కొడుకులు నిందితులుగా ఉన్నందుకేనా ఇంత జాప్యం ? అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల.
ఇది బంగారు తెలంగాణలో మహిళలకు దక్కుతున్న గౌరవం, రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తూ, డ్రగ్స్ కు అడ్డాగా హైదరాబాద్ ను మారుస్తూ ఆడపిల్లల మానాలకు రక్షణ లేకుండా చేసిన KCR, ఇప్పుడు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల. బాధిత మహిళకు కేసీఆర్ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.