ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ కంపెనిలో ఉద్యోగ అవకాశాలు..

-

ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగాల గురించి ఎప్పటి కప్పుడు తెలియజేస్తూన్నారు. తాజాగా మరో నోటిఫికేషన్ గురించి వివరించారు.ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి జాబ్ మేళా లకు సంబంధించి ఇటీవల మళ్లీ వరుసగా ప్రకటనలు విడుదల అవుతున్నాయి. ఇప్పుడు కూడా మరో ప్రముఖ కంపెనీలో ఖాళీలు ఉన్నాయని ప్రకటించింది.. దాని గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ టెక్ మహీంద్రాలో ఖాళీల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేశారు అధికారులు. ఈ ప్రకటన ద్వారా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 6న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఆ తేదీన ఉదయం 9 గంటలకు రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

జాబ్స్ పూర్తీ వివరాలు..

ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్త్రీలు, పురుషులు ఎవరైనా ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా కన్నడ మాట్లాడాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.80 లక్షల నుంచి 2 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. ఇంకా రూ.2 వేలను బ్రేక్ షిఫ్ట్ అలవెన్స్ చెల్లించనున్నారు. రూ.1000 ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు..ఇందులో 100 పైగా ఖాళీలు ఉన్నాయి.

ఇంటర్, గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తమిళం మాట్లాడగలగాలి. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. రూ.2 వేలు బ్రేక్ షిఫ్ట్ అలవెన్స్ చెల్లించనున్నారు. రూ.1000 ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు.ఈ పోస్టులు కూడా 100 ఉన్నాయి.

ఎలా అప్లై చేసుకోవాలి..

అభ్యర్థులు ముందుగా ఈ లింక్ https://apssdc.in/industryplacements/ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 6న ఉదయం 9 గంటలకు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇంటర్వ్యూలను రాఘవేంద్ర డిగ్రీ కాలేజీ, మంత్రాలయం, కర్నూల్ జిల్లా చిరునామాలో నిర్వహించనున్నారు. ఇతర పూర్తి వివరాలకు 7799494856 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.

ఆసక్తి కలిగిన విద్యార్థులు వెబ్ సైట్ ను ఓపెన్ చేసి పూర్తీ వివరాలను తెలుసుకొని అప్లై చేసుకోవాలని మనవి..

Read more RELATED
Recommended to you

Latest news