ఆదివారం చేపలను ఎక్కువగా తింటున్నారా?ఇది చూడండి..

-

నాన్ వెజ్ ప్రియులకు ఏ వారం అయిన కూడా ఒకటే ముక్కను తినడానికి..అయితే ఎక్కువ మంది ఆదివారం తినడానికి ప్రిఫెర్ చేస్తారు. స్కూల్స్ నుంచి ఆఫిసుల వరకూ అన్నీ ఆదివారం సెలవు ఉంటుంది. ఆ రోజు ప్రశాంతంగా వారం పడిన కష్టాన్ని మర్చిపోవచ్చు అని అందరు ఆ రోజు ఎక్కువగా తింటారు. అయితే ఈ మధ్య చికెన్, మటన్ ధరలు పెరగడంతో అందరూ చేపల వైపు మొగ్గు చూపిస్తున్నారు.. అది కూడా ఎక్కువగా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అసలు విషయానికొస్తే..చేపలు చాలామంది ఇష్టంగా తింటారు. అవి మన ఆరోగ్యానికి ఎంత వరకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..చేపలలో ప్రోటీన్, కాల్షియం, ప్రోస్పరెస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరంగా ఉండేందుకు వారానికి రెండు, మూడు సార్లు చేపలు తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. చేపలలో కొవ్వు పదార్ధాలు తక్కువని.. నాణ్యమైన పోషకాలు మరింత ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి వ్యాధులు చేపలు తినడం వల్ల కంట్రోల్‌లో ఉంటాయి.వీటితో పాటు అల్జీమర్స్, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులకు కూడా చెక్ పెట్టొచ్చు. అంతేకాకుండా చేపల తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో డోపమైన్, సెరోటోనిన్ అనే హార్మోన్ల స్థాయిలు పెరిగి డిప్రెషన్స్‌ను తగ్గిస్తాయి. అలాగే చేపలు పలు రకాల క్యాన్సర్లను రాకుండా అడ్డుకుంటాయి..ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ చేపలను ప్రతి వారం తీసుకోవడం మంచిది కాదని కొందరు నిపుణులు అంటున్నారు. అందులోనూ ఈ మధ్య వస్తున్న చేపలు ఫ్రెష్ కన్నా స్టోర్ చేసినవే వస్తున్నాయి.. ఇది గమనించాలి. వేరే వాటిని అంటే చికెన్, మటన్ వంటి వాటిని కూడా తీసుకోవాలట..వారం ఒకటి, మరో వారం ఒకటి అన్నట్లు..మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది..అమితంగా తీసుకుంటే విషయం అని వైద్యులు అంటున్నారు. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే వివిధ రకాలు ట్రై చెయ్యాలని గుర్తుంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news