పవన్ కల్యాణ్ ఏపీ సీఎం కావాలనుకుంటున్నా..సీనియర్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

-

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ధవళ సత్యం జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జనసేనాని రాజకీయాలపై ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

తెలుగు చిత్ర సీమలో విప్లవ సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ డైరెక్టర్ ధవళ సత్యం. రెడ్ సినిమాలు తీసే డైరెక్టర్ గా పేరు గాంచిన ధవళ సత్యం..మెగాస్టార్ చిరంజీవితో ‘జాతర’ అనే సినిమా తీశారు. ఈ సంగతులు పక్కనబెడితే..తాజా ఇంటర్వ్యూలో సత్యం..ఏపీ రాజకీయాలు, పవన్ పార్టీపై పలు కామెంట్స్ చేశారు.

రాజకీయాల్లో కంగారు పనికి రాదని, అది పవన్ కల్యాణ్ కు ఉందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి సేవ చేయకుండానే, రాజకీయాల్లో ఒకటే సారి ఎదగాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారని ధవళ సత్యం అన్నారు. కాపులు రాజకీయంగా అధికారంలోకి రావడం సాధ్యం కాదని, ఐక్యత లేదని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేయాలని డైరెక్టర్ కోరారు.

గత ఎన్నికల్లో జనసేనకు బహుశా ఒక సీటు వస్తుందని, పవన్ కల్యాణ్ ఓడిపోతానని చెప్పానని అన్నారు. తాను జనం దగ్గరికెళ్లి తెలుసుకుని ఆ మాటలు అన్నానని వివరించారు. పవన్ కల్యాణ్ అధికారంలోకి రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ధవళ సత్యం చెప్పారు. ప్రతిపక్ష పార్టీగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం చేశారని సత్యం అడిగారు. పార్టీలోని లోపాలు సరి చేసుకుని ముందుకు సాగాలనేది పవన్ కల్యాణ్ ఇష్టమని చెప్పుకొచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news