బాలయ్య గురించి.. ఈ నటుడు చెప్పిన మాటలు వింటే ఎవరైనా ఫ్యాన్ అవ్వాల్సిందే..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ విశ్వేశ్వర రావు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఒక వీడియో చానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ బాలకృష్ణ గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.NBK107 First Hunt Teaser: Nandamuri Balakrishna is back with yet another 'mass' film | Entertainment News,The Indian Express

నందమూరి బాలకృష్ణ విశాలమైన హృదయం గురించి.. తోటి ఆర్టిస్టుల పట్ల ఎలా ఉంటారు అన్న భావన గురించి తెలియజేశారు ఈ కమెడియన్. నటుడు విశ్వేశ్వర రావు మాట్లాడుతూ.. పెద్దన్నయ్య షూటింగ్ సినిమా జరుగుతున్నదట. ఇందులో బాలకృష్ణ కి ఫ్రెండ్ క్యారెక్టర్ గా నటించారు. ఇందులో హీరోయిన్ గా రోజా నటించింది. ఇక విశ్వేశ్వరరావు ఈరోజు షూటింగ్ అయిపోగానే మర్నాడు రోజున చెన్నై కి వెళ్లి అక్కడ మరొక సినిమాలో షూటింగ్ లో పాల్గొనవలసి ఉంటుంది. అయితే ఆ రోజుకు కావలసిన షూటింగ్ కొన్ని కారణాల వల్ల కాలేదు అని తెలియజేశారు ఈయన.

ఇక మరుసటి రోజు బాలయ్య బాబుతో షూటింగ్ చేసుకొని మళ్లీ రోజు వెళ్ళాలి అంటే తను వెళ్తానో లేదు అనుకున్నాడట. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో టెన్షన్ పడుతూ ఉండటంతో బాలక్రిష్ణ తనని అబ్జర్వేషన్ చేశాడట. దీంతో మేనేజర్ను పిలిచి విశ్వేశ్వరరావు ఏమి అలా ఉన్నాడు అని అడిగారట.Visweswara Rao : Supporting Actor Wiki, Bio, Filmography, Visweswara Rao Movies List, Songs, Age, Videos

దీంతో మేనేజర్ సత్యం అందుకు సంబంధించి పూర్తి వివరాలను బాలకృష్ణకు తెలియజేశారు అట. దాంతో బాలకృష్ణ సరేలే అని అన్నారట. ఇక మేనేజర్ చెప్పిన విషయాలు నటుడు విశ్వేశ్వరరావుకి అసలు తెలియదట. ఇక షూటింగ్ కూడా అయిపోవడం జరిగింది కానీ వెళ్లాల్సిన సమయానికి ట్రైన్ దగ్గరకు వెళ్లలేకపోయారు విశ్వేశ్వరరావు. ఇక ఆ సమయానికి బాలకృష్ణ వచ్చి మేనేజర్ ని పిలిపించి ఫ్లైట్ టికెట్ ఇవ్వమని చెప్పి మేనేజర్ సత్యకు తెలియజేశారు. దీంతో ఫ్లైట్ టికెట్ విశ్వేశ్వరరావుకి ఇచ్చి వెళ్ళమని చెప్పారట. ఎందుకు సార్ ఇదంతా అని అడగగా మీరు మా కోసమే ఆగారు. మన వల్ల ఆయన సఫర్ కాకూడదు. ఇక అక్కడ వారు కూడా షూటింగ్ ఆగిపోకూడదు.. నాకు తెలుసు మీరు ఉదయం నుంచి ఎంత టెన్షన్ పడుతున్నారు అని చెప్పుకొచ్చారు బాలకృష్ణ.

ఆ రోజు సాయంత్రం ఫ్లైట్ కి టికెట్ బుక్ చేసి పంపించారట విశ్వేశ్వర రావుని. ఇక దీంతో ఆయన ఒక కమిటీ అని మాత్రమే నేను ..నా కోసం ఇంత పని చేయడం బాలకృష్ణ గారికి అవసరం లేదు కదా.. అది ఆయన మంచితనం, సాటి ఆర్టిస్టును గౌరవించే పద్ధతి అని తెలియజేశారు. అందుచేతనే ఆయన ఇంత గొప్ప నటుడు అయ్యాడని విశ్వేశ్వర రావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news