పవన్ కల్యాణ్ ‘భవదీయుడు భగత్ సింగ్’లో సల్మాన్ ఖాన్..క్లారిటీనిచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలో ఆయన ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఈ చిత్ర అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో డైరెక్టర్ హరీశ్ ఓ క్లారిఫికేషన్ ఇచ్చారు.

Bhavadeeyudu-Bhagat-Singh
Bhavadeeyudu-Bhagat-Singh

‘భవదీయుడు భగత్ సింగ్’లో బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఉంటారని, ఇందుకు సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతున్నదని ఓ వెబ్ సైట్ న్యూస్ ప్రచురించింది. కాగా, ఈ న్యూస్ పైన డైరెక్టర్ హరీశ్ శంకర్ స్పందించారు.

సల్మాన్ ఖాన్ ‘భవదీయుడు భగత్ సింగ్’లో ఉంటారన్నది నిజం కాదని తెలిపారు డైరెక్టర్ హరీశ్. తాను ఎప్పుడూ సోషల్ మీడియాలో అవెయిలబుల్ లోనే ఉంటానని, ఏదేని న్యూస్ పోస్ట్ చేసే ముందు తనను ఒకసారి సంప్రదించాలని కోరారు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ నేచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news