జుట్టు ఆరోగ్యాన్ని పెంచే వెల్లుల్లి.. ఎలా అంటే..?

-

ప్రతిరోజు మీ తలలో నుంచి గుప్పెడు జుట్టు వూడిపోతుందా.. మీరు ఆ బెంగతో బాధపడుతున్నారా..? అయితే మీ జుట్టు రాలడాన్ని నివారించే విషయం మీ ఇంట్లోనే ఉంటుంది. భారతీయ వంటల్లో వాడే పదార్థాలలో ప్రాచుర్యం పొందిన వాటిలో ఒకటి వెల్లుల్లి . ఈ ఆహారపదార్థము జుట్టు రాలిపోవడం నియంత్రించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లి లో గల విటమిన్ బి6, విటమిన్ సి, మ్యాంగనీస్, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి కాబట్టి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.

వెల్లుల్లి లో యాంటీబ్యాక్టిరియా లక్షణాలు ఉంటాయి.. జుట్టు రాలడానికి కారణం అయ్యే బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి లో ఒక భాగమైన సెలీనియం రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. మరియు జుట్టుపెరుగుదలను ప్రేరేపిస్తుంది . జుట్టు మూలాలను శుభ్రపరుస్తుంది. చుండ్రుకు ఉత్తమ పరిష్కారం అయితే అందిస్తుంది. జుట్టు ఆరోగ్యం కోసం కొబ్బరి నూనె కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కొబ్బరి నూనె తో వెల్లుల్లి కలిపి జుట్టుకు రాస్తే వేగంగా పెరుగుతుంది .

రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ముక్కలుగా కట్ చేయండి. కొబ్బరి నూనె వేడి చేసి వెల్లుల్లి రెబ్బలు వేసి ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక క్లాత్ తో వడపోసి మాడుకు రాసి మసాజ్ చేయండి. మీరు ఈ నూనెను అరగంట సేపు అలాగే ఉంచి ఆ తర్వాత సాధారణ షాంపూతో స్నానం చేయండి. మాడుకు తగిలేలా గా రాస్తే తలలో ఉన్న ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి జుట్టు బాగా పెరుగుతుంది. వెల్లుల్లి మరియు తేనె కలిపి జుట్టుకి రాసుకోవడం వలన తేనే లో వుండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జుట్టు లో ఉన్న చికాకుల, దురద సమస్య ను తొలగిస్తుంది. ఇలా వారానికి ఒకసారైనా చేస్తూ ఉండాలి. వీటితో పాటు సరైనా ఆహార అలవాట్లను అలవర్చుకోవాలి.

మన ఆహారం లో కరివేపాకు ఎక్కువుగా ఉండేలా చూసుకోవాలి. చిన్నపిల్లలు కరివేపాకును భోజనం చేసేటప్పుడు తీసి పక్కన పెడుతుంటారు. అలా చేయకుండా కరివేపాకు పోషకాల గురించి చెబుతువుండాలి. కరివేపాకుతో రైస్, రసం సాంబార్ లాంటివి చేసినప్పుడు మిక్సీ పట్టి వేయడం లాంటివి చేయడం వలన పిల్లలు కరివేపాకు ను పక్కన పెట్టలేరు. నీరు కూడా తగినంత తీసుకుంటూ వుండడం వల్ల రక్త ప్రవాహం పెరిగి జుట్టు కూడా ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news