వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సంపదకు ప్రజలే యజమానులని, సీఎం కేసీఆర్ కాదని అన్నారు.హుజురాబాద్ ఎన్నికల్లో రూ. 600 కోట్లు ఎక్కడినుంచి తెచ్చి ఖర్చు చేశారు? అని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని రైతులు, ప్రమాదంలో చనిపోయిన వారిపై లేని ప్రేమ.. పంజాబ్ రైతులపై ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
సిఎస్, కలెక్టర్లు మద్యం ను ప్రమోషన్ చేసే పనిలో ఉన్నారని తప్పుబట్టారు. కెసిఆర్ కు పోయే కాలం వచ్చింది అందుకనే ఎన్నికల వ్యూహకర్త పీకే అవసరం వచ్చిందని ఈటెల రాజేందర్ అన్నారు. పరిపాలించే సత్తా, సమస్యలు పరిష్కరించే దమ్ము లేకపోయినా దేశాన్ని ఉద్ధరిస్తానని సీఎం కేసీఆర్ గొప్పలు పోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.