సీఎం రేవంత్ రెడ్డి ముందు మరో టాస్క్.. ఆధిపత్యం కొనసాగిస్తారా..?

-

రాష్ట విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది.. కనీసం తెలంగాణాలోనైనా అధికారంలోకి వచ్చిందా అంటే అది కూడా లేదు.. సుమారు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చుంది.. కాకలు తీరిన సీనియర్లు ఉన్నప్పటికీ.. రెండు దఫాలు జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూసి.. బిఆర్ఎస్ కు అధికారాన్ని కట్టబెట్టింది.. ఎన్నిప్రయోగాలు చేసినా.. కాంగ్రెస్ సక్సెస్ కాలేకపోయింది.. ఈ సమయంలో పీసీసీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. పార్టీకి జీవం పోశారు.. క్షేత్రస్తాయి నుంచి పార్టీని బలోపేతం చెయ్యడంతో పాటు.. సీనియర్లతో సమన్వం చేసుకుని.. బీఆర్ ఎస్ ను ఎదుర్కొన్నారు..

క్యాడర్ లో మనోదైర్యం నింపి.. ఎన్నికలకు సిద్దం చేశారు.. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చి.. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ అధికారంలోకి తీసుకొచ్చారు.. ఈ క్రెడిట్ రేవంత్ రెడ్డితో పాటు.. సీనియర్లుకు కూడా వస్తుంది.. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపారు.. ఇవన్నీ పక్కన పెడితే.. సీఎం రేవంత్ రెడ్డికి, ముఖ్యనేతలకు మరో టాస్క్ ఎదురుకాబోతుంది..

అధికారంలో ఉన్న కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతోంది.. గత పదేళ్లలో గ్రామ స్థాయిలో కాంగ్రెస్ నేత పోటీ చెయ్యాలంటేనే ఆలోచించే పరిస్థితి ఉండేది.. అన్నింటా బిఆర్ఎస్ ఆదిపత్యం సాధిస్తే.. కొన్ని చోట్ల మాత్రమే కాంగ్రెస్, బిజేపీ సత్తా చాటేవి.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.. దీంతో లోకల్ బాడీలో సత్తా చాటాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారట..

లోకల్ బాడీస్ ఎన్నికల్లో సత్తా చాటి.. మెజార్టీ స్థానాలను హస్తగతం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మంత్రులకు ఆదేశాలిచ్చారట.. స్థానిక రాజకీయాల్లో ఇన్వాల్ అవుతూ.. క్యాడర్ తో మమేకమవ్వాలని.. ఛాన్స్ ను వదులుకోవద్దని ఆయన సూచించినట్లు ఇంటర్నల్ గా చర్చ నడుస్తోంది.. అందులో భాగంగానే కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్‌ను ఆ పార్టీ ప్రకటించింది. రిజర్వేషన్ అమలు చేశాకే ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నారు.. ఈ అంశం కాంగ్రెస్ కు కలిసొస్తే వార్ వన్ సైడ్ అవుతుందనే భావన రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news