ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..12 దాకా ఆ సర్వీసు లకు గ్రీన్ సిగ్నల్..

-

ఏపీ ప్రభుత్వం ప్రజలకు మరో తియ్యటి వార్థను చెప్పింది..ఉదయం 5 నుండే బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఓపెన్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అంతే కాదు రాష్ట్రవ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర తినుబండారాల దుకాణాలను అర్ధరాత్రి 12 గంటల వరకూ తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. రాష్ట్రంలో హోటల్‌ పరిశ్రమకు చెందిన సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

ఈ ఏడాది మార్చి 14 తేదీ నుంచి ఎలాంటి కొవిడ్‌ నిషేదాజ్ఞలు అమల్లో లేనందున హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 12 వరకూ తెరుచుకునేందుకు అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మినహా ఇతర హోటళ్లు, ఈటరీస్‌ను ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు గంటల వరకూ తెరిచి ఉంచేందుకు కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది…గతంలో ప్రభుత్వం రాత్రి 10.30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆంక్షలు విధించింది. కోవిడ్‌ పరిస్థితులు చక్కబడటంతో వ్యాపార వేళల్ని అర్థరాత్రి 12 గంటల వరకు పొడిగించాలని కోరుతూ హోటల్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని కోరింది..

ఈ విషయం పై పలుసార్లు చర్చించిన ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.హోటళ్ళు, రెస్టారెంట్లు, తినుబండారాల బళ్ళు అర్థరాత్రి 12 గంటల వరకు నిర్వహించుకొనేందుకు అనుమతిచ్చింది. మంగళవారం నుంచి తాజా ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. కోవిడ్‌ నిబంధనల ప్రకారం మాస్క్‌లు ధరించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు..రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు వంటి నగరాల్లో రెస్టారెంట్లు, హోటళ్ళు జనాలతో నిండిపోనున్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news