ఆర్మీలో జాబ్ చేయాలని అనుకోనేవారికి గుడ్ న్యూస్..కమాండ్ హెడ్ క్వార్టర్స్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.వాషర్‌మెన్, ట్రేడ్స్‌మెన్‌మేట్‌ల పోస్టులకు సంబంధించి మొత్తం 65 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన 45 రోజులలోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి. అభ్యర్థులు దరఖాస్తును ఇంగ్లీష్/హిందీలో సబ్‌మిట్ చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు హెడ్ క్వార్టర్స్ కమాండ్‌లోని ఏదైనా AMC యూనిట్‌లో పోస్ట్ ఇవ్వవచ్చు.
విద్యార్హతలు..
వాషర్ మెన్.. మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా అందుకు సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మిలిటరీ/సివిలియన్ దుస్తులను బాగా శుభ్రం చేయాలి.
ట్రేడ్స్‌మెన్ మేట్ పోస్ట్..
బోర్డు నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా అందుకు సమానమైన పరీక్షలో పాసై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లలో ఒక సంవత్సరం వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ప్రతి దరఖాస్తుదారుడు ఒక్కో పోస్ట్‌కి విడిగా దరఖాస్తు చేసుకోవాలి.
రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
కమాండెంట్, మిలిటరీ హాస్పిటల్, డిఫెన్స్ కాలనీ రోడ్, చెన్నై, తమిళనాడు, పిన్: 600032 అనే చిరునామాకు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఎన్వలప్ పైన, క్యాపిటల్ లెటర్స్‌లో కేటగిరీ విభాగంలతో ఏ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారో స్పష్టంగా తెలియజేయాలి.
రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు కూడా ఎన్వలప్ ఎడమ వైపు మూలలో వారి కేటగిరీని పేర్కొనాలి.
అప్లికేషన్ ఫీజు వివరాలు..
అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ప్రశ్నాపత్రం హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లో ఉంటుంది. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇంగ్లీషులో మాత్రమే ఉంటాయి. ఈ పరీక్షలో 10వ తరగతికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉండే అవకాశం ఉంది.
.ఉద్యొగాలకు ఆసక్తి కలిగిన వాళ్ళు సంభంధిత నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేయగలరు..