నాన్ వెజ్ ప్రియులకు బిర్యానీ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..అయితే ఈ మధ్య బిర్యాని తినాలంటే మాత్రం భయపడుతున్నారు.ఎక్కడ చూసిన ఏదో ఒకటి వస్తుంది.దాంతో జనాలు బిర్యానీ తినాలంటే వెనకడుగు వేస్తున్నారు.ఇకపోతే ఇప్పుడు మరో వార్త చక్కర్లు కోడుతుంది..ఇక అంతే బిర్యాని మీద ఉన్న కాస్త ఇంట్రెస్ట్ కూడా పోయింది.
అయితే ఇప్పుడు ఓ వ్యక్తి ఎంతో ఇష్టంగా బిర్యాని తిందామని ఓ హోటల్ కు వెళ్ళాడు. అలాగే రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశాడు. వేడి వేడి బిర్యానీ వచ్చింది.. దాంతోపాటు రైతాకూడా వచ్చింది. గుమగుమలాడుతున్న బిర్యానీ గబగబా లాగించేద్దామనుకుంటే పక్కనే ఉన్న రైతాను చూసి ఖంగుతిన్నాడు కస్టమర్..అసలేం జరిగిందో ఇప్పుడు చుద్దాము..
అసలు విషయం ఏంటంటే..నిజామాబాద్ నగరంలోని లోవీ విందు భోజనం అనే రెస్టారెంట్‌కి వెళ్లారు ఓ కస్టమర్. అక్కడ బిర్యానీతోపాటు సర్వ్ చేసిన రైతాలో పురుగులు కనిపించడంతో హోటల్ యాజమాన్యానికి కంప్లయింట్ చేశాడు. అయితే వారు పట్టించుకోకపోగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం ఇక్కడ తనిఖీలు నిర్వహించకపోవడంతో రెస్టారెంట్ నిర్వాహకులు తమ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. క్వాలిటీ లేని ఫుడ్ సప్లయ్ చేస్తూ.. అర్ధరాత్రి వరకూ రెస్టారెంట్లు నడుపుతున్నా ఎవరూ ఏం మాట్లాడలేదు..ఇది కాస్త నెట్టింట వైరల్ కావడంతో అందరూ షాక్ అవుతున్నారు.ఇది బిర్యానీ ప్రియులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి..