BRS కాదు కేసీఆర్ కు విఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని హెచ్చరించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తెలంగాణలో సొమ్మొ కేంద్రానిది సోకు కేసీఆర్ దని.. ప్రజల సొమ్ముతో పాలన నడుస్తోందని ఆగ్రహించారు. మందు సీసాలు అమ్మితే రాష్ట్రానికి ఆదాయం వస్తోందని.. నన్ను ఓడించేందుకు ఒక్క ఓటుకు 33 వేలు ఖర్చు చేశారని విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ ఫలితమే పునరావృతం అవుతుందని తెలిపారు.
కేసీఆర్ కు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదని నిప్పులు చెరిగారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిఆర్ఎస్ కు ఓటమి తప్పదని.. ఓటమి భయం తోనే కేసిఆర్ పీ కే ను నమ్ముకున్నారన్నారు. తెలంగాణలో పీ కే పప్పులుడకవని.. కుట్రలు గోల్ మాల్ తో మళ్ళీ అధికారం లోకి రావాలని చూస్తున్నారని విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని.. మైనర్ల పై అత్యాచారాలు పెరిగిపోయాయని వెల్లడించారు. తెలంగాణలో మంత్రులు కట్టు బానిసల్లాగా మారిపోయారని.. కేసీఆర్ ఒక మతిలేని చిల్లర నాయకుడు అని ఫైర్ అయ్యారు.