స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని సార్లు మనం ఏదైనా ఒక విషయం గురించి చాలా లోతుగా ఆలోచించినప్పుడు లేదా ఏదైనా విషయంలో చాలా సీరియస్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా రాత్రికి కలలో ఆ విషయాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా పెళ్ళికాని అమ్మాయిలకి కలలో పెళ్లి అయినట్టు కలలు కూడా వస్తూ ఉంటాయి అన్న విషయం వాస్తవమే.. అయితే ఈ కలల వెనుక ఉన్న రహస్యం ఏమిటి..? అన్న విషయాలను ఇప్పుడు మనం ఒకసారి చదివి కలుసుకుందాం..
పెళ్లి కాని అమ్మాయిలకి పెళ్లి అయినట్లు కల వస్తే.. పెళ్లి గురించి తన కలలో తన వివాహం జరిగితే లేదా పూల మాల చూస్తే అది మంచి సంకేతం అట. మీరు కలలో పెళ్లి చూసినప్పుడు మీరు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని అర్థం చేసుకోగలగాలి. ఇక మీ కలలో మీకు వివాహం జరిగినట్టు కల వస్తే కచ్చితంగా మీరు త్వరలో వివాహితులు కాబోతున్నారు. ఒకవేళ మీరు కలలో మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకోవడం చూస్తే.. మీ వివాహం తో మీరు సంతోషంగా లేరు అని అర్థం. ఇక ఇద్దరూ ఒకరితో ఒకరు సమయం గడపడం లేదు అని.. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమ లోపించిందని మీరు పునరుద్ధరించాలి అనుకుంటున్నారు అని అర్థం . ఒకవేళ మీరు మీ వైవాహిక జీవితంలో ఆప్యాయత ప్రేమ లోపాన్ని గనుక ఉన్నట్లయితే మీరు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి కలలు కంటున్నారని అర్థం. ఒకవేళ మీ వివాహం మీ ఇష్టానికి విరుద్ధంగా జరిగినా సరే ఇలాంటి కలలు మీకు కలలో వస్తూ ఉంటాయి.
ఒకవేళ మీరు మీ కలలో వివాహ దుస్తులను చూస్తే త్వరలో డబ్బు సమస్య వస్తుంది అని అర్థం. ఒకవేళ మీరు స్నేహితుల వివాహాన్ని కలలో చూసినట్లయితే మీరు త్వరలో కొంత ఆనందాన్ని పొందవచ్చని అర్థం. ఇక ఈ కల అనేది వివాహాన్ని సూచించడమే కాకుండా మీకు త్వరలో ఉద్యోగం లభిస్తుందని కూడా కొత్త ఉద్యోగాన్ని చేస్తారు అని కూడా అర్థం.