కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే… పబ్బులు, బెల్ట్ షాప్ ల వదలబోమని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రేపటి తెలంగాణ ఎలా ఉండాలని ఆలోచనే ఇవాళ్టి అఖిల పక్ష సమావేశం అని రేవంత్ చెప్పారు. సీఎం కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. నలుగురు ఐదుగురు పోలీసు అధికారుల కె బాధ్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జితేందర్ కు.. రెండు బాధ్యతలు, కమాలసన్ రెడ్డీ కి రెండు బాధ్యతలు, అంజనీ కుమార్ కు రెండు బాధ్యతలు ఇచ్చారని.. సంజయ్ జైన్ కి నాలుగు బాధ్యతలు ఇచ్చారని కేసీఆర్ సర్కార్ పై మండిపడ్డారు. సీఎం కెసిఆర్ కి నచ్చిన వాళ్లకు నజరానా… లేదంటే జూరుమనా అన్నట్టు వ్యవహారం నడిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. సమర్థవంతమైన అధికారులకు బాధ్యతలు ఇవ్వకుండా… కొందరికే బాధ్యతలు ఎందుకు ఇచ్చారని నిలదీశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ పుంజుకుని… అధికారంలోకి కూడా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.