కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై ట్విటర్‌లో కేటీఆర్ ఆరోపణలు

-

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. ఇప్పటికే రైతు చట్టాలు, జీఎస్టీ, నోట్ల రద్దు, రైతు చట్టాలు, సీఏఏ, ఎల్పీజీ ధరలు, ప్రస్తుతం అగ్నిపథ్ పథకంపై ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాలు రైతులకు అర్థం కావన్నారు. జీఎస్టీ వ్యాపారులకు అర్థం కాదన్నారు. నోట్ల రద్దు సామాన్యులకు తెలియదన్నారు. ఎల్పీజీ ధరలు గృహిణులకు ఎలా అర్థం అవుతుందన్నారు. ఇప్పుడు ఈ అగ్నిపథ్ పథకం గురించి యువత ఏం అర్థం అవుతుందన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఆ అర్థం తెలుస్తుందని ఎద్దేవా చేశారు.

మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్

ట్విట్టర్ వేదికగా.. అగ్నిపథ్ అందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఈ హింసాత్మక ఆందోళనల వల్ల దేశంలో నిరుద్యోగ సంక్షోభ తీవ్రతను తెలుపుతున్నాయని పేర్కొన్నారు. గతంలో రైతుల జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పుడు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news