ఏపీ పాలిసెట్ 2022 ఫలితాలు విడుదల చేశారు మంత్రి బుగ్గన. ఈ పాలిసెట్ 2022లో 91.84 మేర విద్యార్ధులు అర్హత సాధించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు మే 29న జరిగిన పాలిసెట్ పరీక్ష నిర్వహించింది సర్కార్. ప్రవేశ పరీక్షకు 1,38,189 మంది దరఖాస్తు అందగా… 1,31,627 మంది పరీక్ష రాశారు.
పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం పొంది న వారు 120866 కాగా.. బాలుర సాధించిన అర్హత శాతం 90.56 గా నమోదు అయింది. బాలికలు సాధిం చిన అర్హత శాతం 93.96 గా నమోదు అయింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు నూరుశాతం అర్హత సాధిం చారు.
రాజమండ్రి రూరల్ కు చెందిన చల్లా సత్య హర్షిత ప్రథమ ర్యాంక్ సాధించగా.. కాకినాడ కు చెందిన అల్లూరి హృతిక్ సత్య నిహాoత్ ద్వితీయ ర్యాంక్ సాధించారు. కాకినాడకు చెందిన టెంకని సాయి భవ్యశ్రీ తృతీయ ర్యాంక్ సాధించారు. ఏపీలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా ఎక్కువ శాతం అర్హత సాధించిందని.. మంత్రి బుగ్గన పేర్కొన్నారు.