బెంగళూరు వేదికగా ఆదివారం రోజు ఆఖరి టి- 20 మ్యాచ్ లో తాడోపేడో తేల్చుకోవడానికి ఇండియా, సౌత్ఆఫ్రికా జట్లు సిద్ధమయ్యాయి. ఐదు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో ప్రస్తుతం ఇరు జట్లు 2-2 తో సమానంగా నిలిచాయి. అయితే ఈ తుది పోరుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. గత వారం రోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ మధ్య జరిగిన పలు రంజీ మ్యాచ్ లకు కూడా వర్షం ఆటంకం కలిగించింది. ఆక్యూవెదర్ ప్రకారం.. ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం బెంగళూరులో ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 84% గా రికార్డు అయింది. అదేవిధంగా మ్యాచ్ సమయంలో తేమ 92 శాతం నుంచి 93 శాతం వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. వరుణుడి ఆటంకం తో అభిమానుల్లో నిరాశ నెలకొంది.