తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఎంతో మంచి పేరు పొందిన నటుడు. తాతకు తగ్గ మనవడిగా పేరుపొందారు..RRR సినిమా పాన్ ఇండియా స్టార్ గా పేరు పొందారు. ఈ తరుణంలో ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో తన తాతతో ఉన్నటువంటి సంబంధం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశారు. ఎన్టీఆర్ 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తాత గారిని మొదటి సారిగా డైరెక్టుగా చూశాడట. ఆ సమయంలో నేను ఒక్కడిని మాత్రమే తాత గారిని బాగా కలవడానికి వెళ్లేవాణ్ని అని తెలిపారు.తన తాత కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారని, నన్ను చూడగానే రండి అని పిలిచారు అని తెలిపారు. ఇక ఎన్టీఆర్ తమ తండ్రి హరిక్రిష్ణ కొడుకులు అందరికీ రామ్ అని పేరు కలిసేలా పెట్టారని తెలియజేశారు. ఆ సందర్భంలోని ఎన్టీఆర్ పేరును తారక రామారావు గా చేంజ్ చేశారని తెలిపారు. నన్ను బంగారంలా చేసుకునే వారని తెలిపారు ఎన్టీఆర్. ఇక తన తండ్రి ఎటువంటి వంట చేసినా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అని తెలిపేవారని ఎన్టీఆర్ తెలియజేశారు.ఎన్టీఆర్ తాతయ్య మరణించిన వార్త విని ఎన్టీఆర్ షాక్ లో నుంచీ తేరుకోలేదు అని తెలిపాడు. NTR అనే పేరును తన తాత తనకు బిరుదుగా ఇచ్చారని అందుచేతనే తన తండ్రి చాలా జాగ్రత్తగా చూసుకునే వారని ఆయన గొప్ప తండ్రి అని తెలియజేశారు ఎన్టీఆర్. అలాంటి ఆయన కడుపులో పుట్టడం తన అదృష్టమని తెలియజేస్తూ ఉండేవారట హరికృష్ణ. ఎన్టీఆర్ కు ఒక స్టార్డం వచ్చేవరకు పరిచయం చేయ కూడదు అని అనుకున్నారట హరికృష్ణ. ఇక ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, బాలయ్య ఫ్యామిలీ తనతో ఎలా ఉంటారో తనకు బాగా తెలుసు అని తెలియజేసారు.ఎన్టీఆర్ ఒకవేళ హీరోగా సక్సెస్ కాకపోతే బిజినెస్ లో సక్సెస్ అయి నందమూరి ఫ్యామిలీ కి మరింత దగ్గరయ్యే వాడిని తెలిపారు. మా మధ్య కల్మషాలు , కష్టాలు తొలగిపోయి కలిసి ఉండడానికి కాస్త సమయం పట్టేదని కానీ ఎప్పటికైనా మేమంతా కలిసే వాళ్ళమని ఎన్టీఆర్ తెలియజేశారు. తన తల్లి తనకు చాలా స్వేచ్ఛ ఇచ్చిందని కూడా తెలియజేశారు ఎన్టీఆర్.