టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత..ప్రజెంట్ తన ప్రొఫెషనల్ కెరీర్ పైన ఫుల్ కాన్సంట్రేట్ చేస్తోంది. ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో పాటు ఓటీటీ ఒరిజినల్స్ చేస్తోంది. ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సమంత..బాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం.
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సమంత..బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. 2005లో విడుదలయిన సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘నో ఎంట్రీ’ సీక్వెల్ త్వరలో స్టార్ట్ చేయబోతున్నారట. ఇందులో హీరోయిన్ గా సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం వచ్చినందున సమంత ఓకే చెప్పేసిందని వినికిడి.
ఈ సీక్వెల్ ఫిల్మ్ లో సమంతతో పాటు మరో పది మంది హీరోయిన్స్ కూడా ఉంటారని బీ టౌన్ సర్కిల్స్ టాక్. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘కబీ ఈద్ కబీ దివాళి’ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు. ఇందులో కథానాయికగా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.