తెలంగాణ ప్రభుత్వ అధికారులు మరోసారి విద్యార్ధులకు భారీ షాక్ ను ఇస్తున్నారు..తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదివేలా అన్ని చర్యలను తీసుకుంటున్నారు..ముఖ్యంగా బెదిరింపులకు దిగుతున్నారు.ప్రైవేట్ స్కూల్ లో చదివితే ఎటువంటి సర్టిఫికేట్స్ ఇవ్వబడవు’ అని తేల్చి చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి.
కార్పోరేట్ బడులకూ ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఆధునికీకరణతో విద్యాభోధనలు చెప్పడంతో ప్రభుత్వ బడుల వైపే తొంగి చూసే పరిస్థితి నెలకొంది. ఇందుకు నిలువుటద్దమే మహబూబూబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూర్ గ్రామపంచాయతీ వారి పేపర్ ప్రకటనలే నిదర్శనం.ఏకంగా ముల్కనూర్ గ్రామపంచాయతీ వారి ప్రకటనలే కావడం విశేషం.
అసలు ఆ కర పత్రం ఏముందో ఓసారి చూద్దాం.. ‘ఒకటవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థుల కోసం వచ్చే ప్రయివేటు స్కూల్ వాహనాలు గ్రామంలోకి అనుమతించ బడవు.. మన గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదవని ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి పిల్లలకు గ్రామ పంచాయతీ తరుపున ఎలాంటి సర్టిఫికేట్స్ ఇవ్వబడవు’ అని ముల్కనూర్ గ్రామంలోని ప్రతి ఇంటికి కర పత్రాలు తిరుగుతున్నాయి..
పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపనప్పుడు ప్రభుత్వం నుండి వచ్చే పథకాల లబ్దిని కూడా పొందకూడదనే ముల్కనూర్ గ్రామంలో చెక్కర్లు కొడుతున్న కర పత్రాల సారాంశం. దీనికి గ్రామ ప్రథమ పౌరుడే సాక్ష్యం. ఈ ప్రకటనలతో బడీడు పిల్లలంతా ప్రభుత్వ బడుల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రథమ పౌరుడి ప్రయత్నం ఫలించడం దానిని తోడు ఉపాధ్యాయులు సహాకరించడం ముల్కనూర్ గ్రామం ప్రభుత్వంతో కలిసి ముందడుగు వేస్తుంది. మరో విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూల్ బస్ లను కూడా ఊరి దరిదాపులకు కూడా రానివ్వక పోవడం గమనార్హం… వీళ్ళ ప్రయత్నం పై రాజకీయ ప్రముఖులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..