ఏపీ రైతులకు జగన్ శుభవార్త.. ఆ రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ

-

ఏపీ కేబినెట్ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణు ప్రకటించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టేందుకు కెబినెట్ ఆమోదం తెలిపిందని…అమ్మఒడికి కెబినెట్ ఆమోదం తెలిపినట్లు వివరించారు. క్రీడాకారిణి జ్యోతి సురేఖకు డెప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఆమోదం తెలిపారని…ఆక్వా రైతులకు సబ్సిడీని మరింత మందికి వర్తింప చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

పదెకరాల వరకు ఆక్వాసాగు చేసుకునే రైతులకు విద్యుత్ సబ్సిడీ ఉన్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణు శుభవార్త చెప్పారు. ప్రస్తుతమున్న జెడ్పీ ఛైర్మన్లనే వారి కాలపరిమితి ముగిసే దాకా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

కొత్త జిల్లాలు ఏర్పడినా.. ఉమ్మడి జిల్లాల జడ్పీ ఛైర్మన్లే కొనసాగుతారు…డిసిప్లీనరీ ప్రొసిడీంగ్స్ ట్రిబ్యునలును రద్దు చేశామని తెలిపారు. రాజ్ భవనులో 100 కొత్త పోస్టులు మంజూరు చేస్తామని ప్రకటించారు. గండికోటలో టూరిజం శాఖకు 1600 ఎకరాల భూమి కేటాయింపు చేశామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news