సీఎం జగన్ కు బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు సవాల్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ కి 175 సీట్లు వస్తాయని, వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని వైసీపీ నాయకులు అంటున్నారని.. నిజంగా ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేయాలని సీఎం జగన్ కి సవాల్ చేస్తున్నానని అన్నారు. వైసీపీ ప్లీనరీలో ఈ విషయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. జగన్ ది దుర్మార్గమైన పాలన అని, రాష్ట్రంలో ప్రజాకంఠక పాలన నడుస్తోందన్నారు.

లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతా నుంచి రూ.800 కోట్ల మాయంపై నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి పంచాయితీ ఖాతాల నుంచి డబ్బు తీసుకున్నారని, ఇప్పుడు ఉద్యోగుల అకౌంట్లో జమ చేసిన డబ్బు డ్రా చేశారని విమర్శించారు. మరి ఎమ్మెల్యేల ఖాతాల నుంచి డబ్బులు ఎందుకు తీసుకోరని ఆయన ప్రశ్నించారు. టెక్నికల్ సమస్య అంటూ దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లాక్కున్న సొమ్ముని వెంటనే అకౌంట్స్ లోకి వేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ చార్జీలు రెండు నెలల్లో రెండు సార్లు పెంచారని మండిపడ్డారు. కేంద్రం డీజిల్, పెట్రోల్ రేట్లు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం బస్సు చార్జీలు పెంచడం ఏమిటి? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news