బ్రష్ చేయకుండానే ముద్దులు…ఆ తర్వాత భార్యపై భర్త దారుణం !

-

కేరళలో దారుణం చోటుచేసుకుంది. బ్రష్ చేయకుండా ముందు పెట్టుకోవద్దన్నందుకు భార్యను ను ధారణంగా హత్య చేశాడు భర్త. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… కేరళలోని పాలకడి జిల్లాలో అవినాష్ నివాసం ఉంటున్నాడు. అతనికి గతంలో వివాహం కాదా మొదటి భార్యకు విడాకులు ఇచ్చి 2019లో దీపిక అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

పెళ్లయిన నాటి నుంచి వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వీరికో కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల అవినాష్ పొద్దున్నే నిద్ర లేచి తన కుమారుడుని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. భార్య వెంటనే గమనించి.. బ్రష్ చేయకుండా పిల్లవాడిని ముద్దు పెట్టుకోకుడదని హెచ్చరించింది.

ఇదే విషయంపై భార్యాభర్తలు ఇద్దరు గొడవకు దిగారు. ఈ క్రమంలోనే వారి మధ్య మాట, మాట పెరగడంతో… భర్త అవినాష్ కోపం కట్టలు తెంచుకుంది. దీంతో కోపంతో ఊడిపోయిన భర్త భార్యను ఇంట్లో ఉన్న కొడవలితో దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… అవినాష్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news