మహిళల గురించి చాణిక్యుడు ఏం చెప్పాడంటే..?

-

ప్రముఖ నీతి శాస్త్ర గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . భవిష్యత్తు ను ఊహించి తన నీతి శాస్త్రం ద్వారా ఎన్నో మార్గాలను ప్రజలకు సూచించడం జరిగింది. మరీ ముఖ్యంగా మహిళల గురించి చాణిక్యుడి చెప్పిన వ్యాఖ్యలు వింటే మాత్రం ఖచ్చితంగా వారిపై మరింత గౌరవం పెరుగుతుందని చెప్పవచ్చు. సృష్టికి మూల కారణం స్త్రీ అని చెప్పవచ్చు .అందుకే ఆడవారిని ఆదిపరాశక్తిగా భావిస్తూ ఉంటారు. ఇకపోతే కలియుగంలో ఉండే కొంతమంది ఆడవారి గురించి చాణుక్యుడు ఏం చెబుతున్నాడు అంటే.. ముఖ్యంగా ఆడవారు మగవారికి ఆకర్షితులవడానికి ప్రధాన కారణం డబ్బు అని చెబుతున్నాడు. అలాంటి డబ్బును జాగ్రత్తగా దాచుకోవాలట.

ఇక పురుషులు వివాహం చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరి వివాహం చేసుకోవాలని సూచిస్తున్నాడు . కొంతమంది అమ్మాయిల అందాలను చేసే వివాహం చేసుకోవడం మంచిది కాదు అని, అందం అంటే కేవలం రంగు మాత్రమే అని, అమ్మాయి యొక్క మనసును చూసి వివాహం చేసుకోవాలని చాణుక్యుడు తెలియజేశారు. ఇక మగవారి కంటే ఆడవారు చాలా తెలివైన వారు అని అంతేకాదు మగవారి కంటే ఆడవారు చాలా ధైర్యవంతులట. ఇక ఒక స్త్రీ ఎన్ని పూజలు చేసినప్పటికీ తన భర్త పాదాలను తాకకపోతే తనపై గౌరవం లేనట్లే అని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పురుషులను అత్యంత వ్యామోహానికి గురి చేసే వస్తువు ఏదైనా ఉంది అంటే అది కేవలం స్త్రీ మాత్రమే అని తెలియజేశాడు చాణుక్యుడు.

ముఖ్యంగా సాధువులు ,సన్యాసులు స్త్రీలకు దూరంగా ఉండాలి అని లేకపోతే వారి వ్రత భంగం అవుతుంది అని తెలియజేశారు. భర్త సంతోషాన్ని , కుటుంబ యోగక్షేమాలను, కష్టసుఖాలు స్త్రీ పాలు పంచుకోవాలని చాణుక్యుడు తెలియజేస్తున్నారు. కానీ ఇప్పటికీ చాలామంది మహిళలు మగవారి చేతిలో మోసపోతున్నారు అని అందుకు కూడా మహిళలు జాగ్రత్తగా ఉండాలని కూడా తెలియజేస్తున్నాడు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news