బోయపాటి శ్రీను వల్లే చంద్రబాబు ఓడిపోయారా?

-

Was chandrababu defeated because of boyapati srinu?

ఎట్టెట్టా? బోయపాటి శ్రీనుకు.. చంద్రబాబుకు ఏంటి లింకు. ఆయన వల్ల ఈయన ఎందుకు ఓడిపోయారు అంటారా? ఉంది.. సంబంధం ఉంది. మీకు గుర్తుందా? సరిగ్గా ఎన్నికల సమయంలో ఏ టీవీలో చూసినా టీడీపీ యాడ్స్ హోరెత్తించాయి. మామూలుగా కాదు.. రాయలసీమలోని చిట్టచివరి గ్రామానికి నీళ్లు వచ్చినట్టుగా, నిరుద్యోగ భృతి మీద, పసుపు కుంకుమ పేరు మీద.. ఇలా పదుల సంఖ్యలో యాడ్స్ తీసి టీవీ చానెల్స్‌లోకి వదిలారు.

తన క్రియేటివిటీని మొత్తం వాడిన బోయపాటి.. బుల్లి తెరపై తన ఎమోషన్స్‌తో పెద్ద సినిమానే చూపించారు. అయితే.. నిజానికి ఏపీలో ఎటువంటి అభివృద్ధి జరగకున్నా… అమరావతిని గ్రాఫిక్స్ మాయాజాలంతో మైమరిపింపజేసి ఏదో చేద్దామనుకున్నారు చంద్రబాబు. అదే బెడిసికొట్టింది. టీడీపీ చేసింది తక్కువ కానీ.. యాడ్స్ పేరుతో గొప్పలు చెప్పుకుంటుందని ప్రజలు గుర్తించారు. చంద్రబాబు అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతారని గ్రహించి.. చంద్రబాబును ఘోరాతిఘోరంగా ఓడించారు ఏపీ ప్రజలు.

అయితే.. కేవలం బోయపాటి యాడ్స్ వల్లే టీడీపీ ఓడిపోయిందని చెప్పలేం కానీ.. వాస్తవానికి దూరంగా ఉన్న ఆ యాడ్స్ వల్ల కూడా ఏపీ ప్రజలకు చంద్రబాబు అసలు స్వరూపం తెలిసిందని.. అందుకే.. ఏపీ ప్రజలు ఏకపక్షంగా వ్యవహరించి చంద్రబాబును ఓడించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news