మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా: జ‌గ‌న్‌

-

ఏపీలో ఉన్న 5 కోట్ల మందిలో ఒక్కరికే దేవుడు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారని.. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించి.. ప్రజలకు భరోసా ఇవ్వాలన్నారు.

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లాడారు. గొప్ప విజయం అందించిన ప్రజలందరికీ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో 175 కు 150, లోక్‌సభ ఎంపీలు 25కు 25 గెలవడం అనేది చారిత్రక విజయమన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది నూతన అధ్యాయమని జగన్ తెలిపారు. ఈ విజయం తన బాధ్యతను పెంచుతుందన్నారు. దేవుడి దయ, ప్రజల దీవెనలతోనే విజయం సాధ్యమయిందన్నారు. ప్రజలు ఓటేశారంటే అది విశ్వసనీయతకు ఓటు అని జగన్ స్పష్టం చేశారు.

ys jagan press meet

ఏపీలో ఉన్న 5 కోట్ల మందిలో ఒక్కరికే దేవుడు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారని.. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించి.. ప్రజలకు భరోసా ఇవ్వాలన్నారు. తనకు ఆ అవకాశం వచ్చిందని.. సుపరిపాలన అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారు. వచ్చే ఆరు నెలల నుంచి ఏడాదిలోపే జగన్ మంచి సీఎం అని మీరంతా అనేలా చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. నా ప్రతి అడుగు మీరు ప్రశంసించేలా ఉంటుందని చెబుతున్నా.. అంటూ జగన్ తెలిపారు.

సుపరిపాలనకు తొలి అడుగు నవరత్నాలేనని.. పాదయాత్రలో ప్రజల కష్టాలు నేను చూశా..నేను విన్నా.. నేనున్నా.. అంటూ జగన్ హామీ ఇచ్చారు. తొలిసంతకం కాదు.. నవరత్నాలన్నింటినీ అమలు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

ఈనెల 30న విజయవాడలో ప్రమాణ స్వీకారం

ఈనెల 30న విజయవాడలోనే తన ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news