జోగినపల్లి సంతోష్ ఓ ఇసుక మాఫియా డాన్ – జగ్గారెడ్డి

-

ఇసుక దందా కి కరీంనగర్ అడ్డాగా మారింది అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.కరీంనగర్ నుంచి సంగారెడ్డికి ఇసుక రావాలంటే ఒకప్పుడు 2 వేలకు దొరికే ట్రాక్టర్ ఇసుక ట్రిప్ ఇప్పుడు 80 వేలకు చేరిందన్నారు. బ్లాక్ మనీ ఎక్కువగా ఫార్మా, ఇసుక దందా లో వస్తుంది. అందుకే పార్థసారధికి, జోగినిపల్లి సంతోష్ కి రాజ్యసభ సీట్లు ఇచ్చారని ఆరోపించారు. కరీంనగర్ లో జోగినిపల్లి సంతోష్ కు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కొడుకు ఇసుక మాఫియా నడిపిస్తున్నారని అన్నారు.

jaggareddy | జగ్గారెడ్డి
jaggareddy | జగ్గారెడ్డి

ఒక ఎమ్మెల్యేకు 10 కోట్ల కారు ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అన్నారు. ఇసుక మాఫియాకు జోగినిపల్లి సంతోష్ కుమార్ డాన్ మారారని, ఇది మంచి పద్ధతి కాదు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ జిల్లాకు, ఆ జిల్లాకే మైన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. తక్కువ ధరకే ఇసుక అందుబాటులోకి వచ్చేలా చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news