‘వెల్కం’ పాలిటిక్స్: కేసీఆర్ నిర్లక్ష్యం.. జగన్ లౌక్యం!

-

ఎక్కడైనా రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి తప్ప.వ్యక్తిగత కక్ష అన్నట్లుగా చూడకూడదు. సాధారణంగా ఏ నాయకుడుకైన రాజకీయ పరమైన  విభేదాలు తప్ప, వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. అప్పుడే ఆరోగ్యకరమైన రాజకీయం నడుస్తోంది. కానీ ప్రస్తుతం రాజకీయాలు అలా లేవు…పూర్తిగా వ్యక్తిగత కక్షలతోనే రాజకీయం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేదు…అన్నీ పార్టీలు అదే మాదిరిగా రాజకీయం చేస్తున్నాయి. అయితే కింది స్థాయిలో వ్యక్తిగతమైన రాజకీయాలు ఉంటే పర్లేదు…కానీ పై స్థాయిలో కూడా అలాగే ఉంటే..జనం హర్షించరు.

తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన పనిని కూడా ఎవరు హర్షించలేదనే చెప్పాలి. ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఉంటూ…తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీకి కేసీఆర్ స్వాగతం పలకలేదంటే..రాజకీయం ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితి ఉంది. అయితే ఇదంతా రాజకీయం…కానీ ఒక ముఖ్యమంత్రి, ప్రధానిని స్వాగతించలేని పరిస్తితిలో ఉన్నారంటే జనం హర్షించరు. హైదరాబాద్ లో ఉండి కూడా…మోదీకి వెల్కం చెప్పేందుకు సీఎం కేసీఆర్ రాలేదు. పైగా రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా వస్తే మాత్రం భారీ స్థాయిలో స్వాగతం చెప్పారు. ఎంత రాజకీయ పరమైన విభేదాలు ఉన్నా సరే కేసీఆర్ ఇలా చేయడం కరెక్ట్ కాదనే వాదన తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తోంది.

అదే సమయంలో ఏపీలో అడుగుపెట్టిన మోదీకి…స్వయంగా సీఎం జగన్ ఎయిర్ పోర్టుకు వెళ్ళి స్వాగతం పలికారు.  అటు చంద్రబాబు, పవన్ సైతం మోదీకి సోషల్ మీడియా వేదికగా వెల్కం చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ఏ స్థాయిలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందో తెలిసిందే…అటు వైసీపీ నేతలు బీజేపీపై ఫైర్ అవుతారు. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతతో ఉండాలనే సూత్రం జగన్ పాటిస్తూ..లౌక్యంతో రాజకీయం చేస్తున్నారు. కానీ కేసీఆర్ పూర్తిగా ప్రధాని పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు…ఇలా రాజకీయ పరంగా కాకుండా…వ్యక్తిగతంగా రాజకీయం చేస్తే…గతంలో ప్రదని మోదీని తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు పరిస్తితి ఏమైందో ఇప్పుడు కేసీఆర్ పరిస్తితి కూడా అదే అవుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news