టెన్త్ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 5 రోజులే ఛాన్స్..

-

తెలంగాణ రాష్ట్రంలో గురుకుల స్కూల్స్ తో పాటుగా మోడల్ స్కూల్స్ కూడా బాగా అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే..అక్కడ కూడా మంచి విద్య దొరుకుతుంది. దాంతో ఎక్కువ మంది ఆ స్కూల్స్ లో జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు..తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను మోడల్ స్కూళ్లలో చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా తెలంగాణ మోడల్ స్కూల్స్ సొసైటీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇంటర్ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 194 మోడల్ స్కూళ్లలో నిర్వహిస్తున్న నాలుగు కోర్సుల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది..జూలై 10 వరకూ మాత్రమే ఛాన్స్ ఉంది.

ఈ స్కూల్స్ లో చేరెందుకు అర్హత కలిగిన విద్యార్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని మోడల్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ ఉషారాణి వెల్లడించారు. ఆయా స్కూళ్లలో పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయా స్కూళ్లలో మొత్తం 31 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. విద్యార్థులు www.tsmodelschools.com వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.

ఆ స్కూల్స్ కు ఎలా అప్లై చెయ్యాలంటే? 

*. అభ్యర్థులు మొదటగా మోడల్ స్కూల్స్ అధికారిక వెబ్ సైట్ https://www.tsmodelschools.com/ ను ఓపెన్ చేయాలి.

*. హోం పేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

*. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో పేరు, ఇంటి పేరు, తల్లిపేరు, తండ్రి పేరు, టెన్త్ హాల్ టికెట్ నంబర్ తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను అప్ లోడ్ చేయాలి.

*. అనంతరం సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని జాగ్రత్తగా దాచి పెట్టుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news