బీటెక్ చేసిన వారికి గుడ్ న్యూస్.. రైల్వే లో ఉద్యోగ అవకాశాలు..

-

బీటెక్ చేశారా? ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా? మీకో గుడ్ న్యూస్..సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కోల్‌కతా ప్రధాన కేంద్రంగా నడిచే ఈ సంస్థలో వివిధ విభాగాల్లో ఉన్న జూనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు..కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?అనేది పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..

ఖాళీలు, ఉద్యోగ అర్హతలు.. 

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సివిల్‌ ఇంజినీరింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ (15), ఎలక్ట్రికల్‌ కన్‌స్ట్రక్షన్‌ (02) పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు 2021/ 2022 వాలిడ్‌ గేట్‌ స్కోర్‌ కలిగి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఉద్యోగాల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* అభ్యర్థులు తమ దరఖాస్తులను సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌, సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే, గార్డెన్‌ రీచ్‌ రోడ్‌, కోల్‌కతా-700043 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 18-07-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* అభ్యర్థులను గేట్‌ మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకొవాలి..

Read more RELATED
Recommended to you

Latest news