విష్ణువర్థన్‌ రెడ్డిని టార్గెట్‌ చేస్తున్న నెటిజన్లు..

-

ఇటీవల అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి వేడుకల నేపథ్యంలో ప్రధాని మోడీ భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామ రాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి కూడా హాజ‌ర‌య్యారు. అయితే ఆహ్వానాలు అందినా కూడా టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు హాజ‌రు కాలేదు. వీరి గైర్హాజ‌రుపై ఇప్పుడు ఒక్కొక్క‌రు ఒక్కో విశ్లేష‌ణ వినిపిస్తున్నారు. ఈ విశ్లేష‌ణ‌ల‌కు చెక్‌పెట్టే దిశ‌గా ఏపీకి చెందిన బీజేపీ యువ నేత విష్ణువర్ధన్ రెడ్డి మంగ‌ళ‌వారం రాత్రి ఓ ట్వీట్ చేశారు.

BJP Claims Credit For Release Of Polavaram Dues!

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అంద‌రికీ ఒకేసారి ఆహ్వానాలు పంపార‌న్నారు. విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ట్వీట్‌ను చూసిన వెంట‌నే ప‌లువురు నెటిజ‌న్లు ఆయ‌న‌పై ట్రోలింగ్ స్టార్ట్‌ చేశారు. విజ్ఞ‌ప్తి ఓకే గానీ… మీరు పోస్ట్ చేసిన ఆహ్వానాల్లో ఒక్కో దానిపై ఒక్కో తేదీ ఉంద‌ని ఆయ‌న‌కు నెటిజ‌న్లు గుర్తు చేశారు. అంతేకాకుండా కొన్ని ఆహ్వానాల‌పై తేదీని చేతితో రాస్తే… మరికొన్నింటిపై సీల్‌తో వేసిన విష‌యాన్ని మ‌రికొంద‌రు ప్ర‌స్తావించారు. అయినా కార్య‌క్ర‌మం అయిపోయాక ఈ వివ‌ర‌ణ‌లేమిటని కూడా ఆయ‌న‌ను ప్ర‌శ్నించారు. వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కార‌ణంగానే విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ఈ ట్వీట్ పోస్ట్ చేశార‌ని నెటిజ‌న్లు విమర్శలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news