ఇంటర్ పాసయ్యారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. మీకోసం సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇంటర్ కు సాఫ్ట్ వేర్ ఏంటి.. అనే ఆలోచన వస్తుంది కదా.. మీరు విన్నది అక్షరాల నిజం.. ఈ మధ్య సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎక్కువ అయ్యాయి..ఇక ఇక మంది ఈ ఫీల్డ్ లో జాబ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు..మంచి జీతం తో పాటు మరెన్నో ఆఫర్లు ఉండటం తో ఈ ఫీల్డ్ కు డిమాండ్ పెరిగిపోతుంది.
సాఫ్ట్ వేర్ జాబ్ రావాలంటే బీటెక్ చేసి ఉండాలని అంటారు.. కానీ ఇప్పుడు ఇంటర్ అర్హత ఉంటే చాలు అంటుంది..ఓ ప్రముఖ సంస్థ..హెచ్ సీఎల్ టెక్నాలజీస్ ఇంటర్ పూర్తిచేస్తే చాలు ఐటీ ఉద్యోగ అవకాశం ఉంటుందని చెబుతోంది. హెచ్ సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్ ద్వారా ఎంట్రీ లెవల్ ఐటీ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణను అందిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది.. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇందుకు ఎంపిక కావాలంటే అభ్యర్థుల అర్హత ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. అది కూడా 2021, 2022లో ఉత్తీర్ణులై ఉండాలి. 60 శాతం మార్కులతో మ్యాథమేటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హెచ్సీఎల్ కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తుంది. దీనిలో ప్రతిభ కనబరిచిన వారికి ఇంటర్వ్యూలో కొన్ని ప్రమాణాలను పరిశీలిస్తారు. తర్వాత 12 నెలల కాలానికి శిక్షణ ఉంటుది. దీనికి ఫీజు రూ. 2లక్షలు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2లక్షల కంటే తక్కువ ఉన్నవారికి బ్యాంక్ నుంచి లోన్ సౌకర్యం కల్పించనున్నారు. ట్రైనింగ్ లో నిర్వహించే పరీక్షలో 90 శాతం అంతకన్నా ఎక్కువ స్కోర్ చేసిన వారికి ప్రోగ్రామ్ ఫీజులో 100 శాతం రాయితీ కల్పించనున్నారు.
85 నుంచి 90 శాతం మధ్య ఉంటే.. 50 శాతం రాయితీ ఇస్తారు. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని హెచ్ సీఎల్ టెక్నాలజీలో పూర్తికాల ఉద్యోగులుగా నియమించుకుంటారు. ఎంపికైన అభ్యర్థులను లక్నో, నోయిడా, మధురై, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, నాగపూర్లోని కేంద్రాల్లో శిక్షణ అందిస్తారు. టెక్ బీ ప్రోగ్రామ్ లో భాగంగా ఇంషిప్ చేసేటప్పుడు అభ్యర్థికి నెలకు రూ.10 వేలచొప్పున స్టయిపెండ్ చెల్లిస్తారు. పూర్తిస్థాయి ఉద్యోగిగా ఎంపికైతే, వారికి ఏడాదికి 1.70 లక్షల నుంచి 2.50 లక్షలు ఉంటుంది.
దరఖాస్తు: https://www.hcltechbee.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి.. https://www.hcltechbee.com/about-us/#check-before లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి…