యూపీలోని గోరఖ్పూర్ లో దారుణం చోటుచేసుకుంది. గోరక్ పూర్ కు చెందిన యువతని ఎనిమిది నెలల కింద అదే ప్రాంతానికి చెందిన యువకుడి తో పెళ్లి అయింది. యువతి కుటుంబం పేదరికంలో ఉండటంతో కట్నం కానుకలు పెద్దగా చెల్లించుకోలేకపోయింది. అయితే పెళ్లికి ముందు ఉద్యోగం చేస్తున్నానని చెప్పిన యువకుడు ఆ తర్వాత జులాయిగా తిరిగేవాడని తేలింది.
అయినా యువతి ఓర్చుకుని భర్తతో కలిసి జీవిస్తోంది. ఇక అటు ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగా క్షీణించి పోయాయి. ఈ నేపథ్యంలోనే ఇంట్లోనే మందు పార్టీలు చేసుకుని భార్యను వారితో శృంగారం చేయమని ఒత్తిడి చేసేవాడు ఆ దుర్మార్గుడు. ఆమె అంగీకరించకపోతే.. తాను అత్యాచారం చేసి వాళ్లతో అత్యాచారం చేయించేవాడు.
ఆ సమయంలో న్యూడ్ వీడియోలు చిత్రీకరించేవాడు. ఎవరితోనైనా గడపకపోతే న్యూడ్ వీడియోలను బయటపెడతానని బెదిరింపులకు పాల్పడేవాడు. అతడి చర్యలకు విసిగిపోయిన భార్య గురువారం పోలీసులను ఆశ్రయించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అతన్ని అరెస్టు చేశారు.