చాలా మంది యువత పెళ్ళి చేసుకొనేది హనీమూన్ కోసమే..మన భాషలో చెప్పాలంటే ఫస్ట్ నైట్..పెళ్ళికి ముందు కూడా ఎన్నో రాత్రులు కొందరు గడిపే ఉంటారు..అది వేరే విషయం..కానీ ఓ జంట మాత్రం హనీమూన్ ను వద్దనుకున్నారు.. అందుకు బలమైన కారణమే ఉంది.. ఆ ప్రాంతంలో నీటి సమస్య ఎక్కువగా ఉండటంతో ఇలాంటి ఆలోచన చేసినట్లు ఆ యువకుడు చెబుతున్నాడు.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని కొల్హాపూర్ నగరంలో నివసిస్తున్న విశాల్ కొలేకర్కు అపర్ణతో ఒక పెళ్లి జరిగింది. ఆ తరువాత వీరి ఊరేగింపు వేడుక జరిగింది. ఈ ఊరేగింపులో వారు ఒక వాటర్ ట్యాంకర్‌పై ఊరంతా తిరుగుతూ ఆశ్చర్యపరిచారు. అయితే వీరు ఇలా చేయడానికి ఒక కారణం ఉంది. అది ఏంటంటే, కొల్హాపూర్ ప్రాంతంలో నీటి సరఫరా సరిగా జరగడం లేదు. ఇక్కడ వారం రోజులకు కేవలం ఒక్కసారే నీళ్ల పంపులు వస్తున్నాయి.
విశాల్ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి సమస్యలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాల గురించి అధికారులకు తెలియజేసినా వారు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.దీంతో చిర్రెత్తుకొచ్చిన వరుడు విశాల్ నీటి సమస్యలు తీర్చేంతవరకూ తన భార్యతో కలిసి తాను హనీమూన్‌కు వెళ్లనని ప్రతిన పూనాడు. నగరంలో నీటి సమస్యల గురించి అందరికీ తెలిసేలా విశాల్ తన వధువును వాటర్ ట్యాంకర్‌పై ఊరేగించాడు.
ఈ ఊరేగింపు ఇప్పుడు నగరవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఈ సమస్య గురించి దేశవ్యాప్తంగా తెలుస్తోంది. ప్రజల ఇబ్బందులు తెలుసుకోలేనంత నిద్రమత్తులో ఉన్న స్థానిక ప్రభుత్వాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేసిన ఈ నవ దంపతులను అందరూ అభినందిస్తున్నారు.మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
મહારાષ્ટ્રનાં કોલ્હાપુરમાં એક અનોખા વિવાહ સમારંભ થયો છે. આ એક નવદંપત્તિનાં જ્યાં સુધી તેમનાં વિસ્તારમાં પાણીનું સપ્લાય યોગ્ય રૂપથી નથી થતું ત્યાં સુધી તે હનીમૂન પર નહીં જાય તેવો નિર્ણય લીધો છે. #Maharastra #Kolhapur #WeddingOnWaterTanker pic.twitter.com/OD6BaBffK7
— News18Gujarati (@News18Guj) July 8, 2022