పవన్ కళ్యాణ్ వీకెండ్ ప్రజా సేవ చేస్తున్నారని…అది కూడా నెలలో రెండు ఆదివారాలు మాత్రమే ప్రజా సేవ చేస్తామంటున్నారని విమర్శలు చేశారు. అన్నీ వదులుకుని ప్రజా సేవ చేస్తానంటూ డబ్బా కబుర్లు చెప్పిన పవన్.. ఇప్పుడు వీకెండుకు పరిమితమయ్యారని ఫైర్ అయ్యారు. లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ స్టేట్మెంటును మూడేళ్ల క్రితమే ప్రజలు అమలు చేశారు…చంద్రబాబుతో కుర్చీ ఖాళీ చేయించి.. ప్రజలు మూడేళ్లు ఏనాడో ఆ కుర్చీలో కూర్చొన్నారన్నారు.
పవన్ను అసెంబ్లీ గేటు తాకనివ్వనిది భీమవరం, గాజువాక ప్రజలే తప్ప.. వైసీపీ కాదు….పవన్ ప్రఖ్యాత చిలక జోస్యుడని సెటైర్లు పేల్చారు. 2019లో జగన్ సీఎం కాడు.. కాలేడు అని పవన్ చిలక జోస్యం చెప్పారు.జగన్ 100 శాతం ప్రజలను నమ్ముకుంటారు.. పవన్ లాగా విమానాల కంపెనీల వాళ్లని.. చంద్రబాబును, మోడీని నమ్ముకోలేదు.ప్రవచనాలు చెప్పే విషయంలో పవన్ చాగంటి కోటేశ్వరరావును మించిపోయారని ఫైర్ అయ్యారు. పవన్ రాజకీయ ప్రవచనకారుడు అయ్యాడు.కారు అద్దం తీయడం.. చేతులు ఊపడమేనా రాజకీయమని ఆగ్రహించారు. కోనసీమకు అంబేద్కర్ పేరే ఎందుకు పెట్టాలని పవన్ గతంలో అనడం నిజం కాదా..?ఇప్పుడేమో అంబేద్కర్ పేరు పెడితే స్వాగతించింది తానేనని పవన్ చెప్పుకుంటున్నారన్నారు.
మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ను వెటకారం ఆడుతూ పవన్ మాట్లాడింది నిజం కాదా..?పవన్ మీకు రౌడీయిజం ఇష్టం లేదా..? మరి పరిటాల రవి ఇంటికెందుకెళ్లారు..? బాగా మర్డర్లు చేశారని పలకరించడానికి వెళ్లారా..? ఆని నిప్పులు చెరిగారు. 2014-2019 మధ్య కాలంలో అధికారాన్ని పంచుకున్న పవన్ కౌరవుడేనా..?నాడు చంద్రబాబు ధుర్యోధనుడైతే.. పవన్ దుశాస్సనుడా..? అని మండిపడ్డారు. 2014-19 మధ్య కాలంలో పైన.. కింద పవన్ అధికారంలో ఉన్నారు.. ఇప్పుడు పైన అధికారంలో ఉన్నారన్నారు.