తెలంగాణ రాష్ట్ర సమితి రెండు రోజు క్రితమే ప్రగతి నివేదన సభను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. తెరాస కార్యకర్తల్లో ఆ జోష్ తగ్గకుండానే సెప్టెంబర్ 7న మరో బహిరంగ సభను నిర్వహించనుంది. అయితే ఈ ‘ప్రజా ఆశీర్వాద సభ’ గా నామకరణం చేసినట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
ముందస్తు ఎన్నికలకు సంబంధించి తెరాస మరింత దూకుడుని పెంచింది. సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ఎవ్వరికి చిక్కని వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావు నిత్యం సమీక్షిస్తున్నారు. జిల్లా ముఖ్య నేతలకు పలు బాధ్యతలు అప్పగించి ఏర్పాట్లను చకచక పూర్తి చేస్తున్నారు.