నాగచైతన్య ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడా..?

-

తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఈ కుటుంబం నుంచి ఎంతోమంది ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు కానీ ఇందులో పెద్దగా ఏ హీరో కూడా సక్సెస్ కాలేకపోయారు కేవలం నాగచైతన్య మాత్రమే అంతంత మాత్రమే ఆకట్టుకుంటూ ఉన్నారు. నాగచైతన్య తన కెరియర్ మొదట జోష్ చిత్రం ద్వారా మొదలుపెట్టారు కానీ ఈ చిత్రం కూడా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఆ తర్వాత సమంతతో కలిసి ఏం మాయ చేసావే చిత్రం మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇక ఆ తరువాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నాడు నాగచైతన్య. ఇక ఇలాంటి సమయంలోనే సమంతను ప్రేమించి వివాహం చేసుకున్నాడు కానీ కొన్ని కారణాలవల్ల గత ఏడాది వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇక తర్వాత ఎవరు సినీ కెరియర్లు వారు చాలా బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల నాగచైతన్య బంగారు రాజు, లవ్ స్టోరీ వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. తాజాగా నాగచైతన్య నటిస్తున్న థాంక్యూ చిత్రం కూడా ఈ నెల 22న విడుదల కాబోతున్నది. ఇక ఇందులో నాగచైతన్య తో రాశి ఖన్నా జోడిగా నటిస్తున్నది ఈ చిత్రాన్ని విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ చేశారు.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక్కటి కూడా బాగానే ఆకట్టుకున్నది. ఇక ఈ చిత్రంలోని కొన్ని డైలాగులు సమంతకు కౌంటర్ ఇచ్చేలా కనిపిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న రాశీ ఖన్నా నాగచైతన్య గురించి కొన్ని విషయాలను తెలియజేసింది. నాగచైతన్య ఎవరితోనో అంతగా కలిసి పొడు, నాగచైతన్య దగ్గర ఎంత ఖరీదైన వస్తువులు ఉన్నా కూడా సాధారణ వ్యక్తి లా కనిపిస్తాడు. అంతేకాకుండా నాగచైతన్య తన కళ్ళకు ఉండే సైట్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలియజేసింది అందుచేతనే ఎక్కువగా అద్దాలను ఉపయోగిస్తూ ఉంటాడని తెలిపింది. కానీ అందరూ ఆయనకి స్టైల్ కోసం ఉపయోగిస్తున్నారేమో అనుకుంటారని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఈ విషయం తెలిసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news