జగన్ సర్కార్‌ మరో పథకం..వారి అకౌంట్లలోకి రూ.10 వేలు..పూర్తి వివరాలు..

-

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారు..ఇప్పటికే జగనన్న విద్యాదీవెన, జగనన్న అమ్మఒడి, విద్యాకానుక , వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం పేరుతో పలు పథకాలన అమలు చేసిన ప్రభుత్వం అదే కోవలో మరో పథకాన్ని ప్రజలకు అందించనుంది.

రోడ్ల పై తోపుడు బండ్లు, చిరు వ్యాపారాలు చేసుకోనేవారికి జగనన్న తోడు పేరుతో వడ్డీలేని రుణాలను అందిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని లక్షలాది మంది చిరువ్యాపారులకు రూ.10వేల చొప్పున సున్నావడ్డీ రుణాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.

ఈ నెల 26 న అంటే మరో మూడు రోజులలో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో దీనికి సంబంధించిన కసరత్తు జరగుతోంది. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది ఏపీ ప్రభుత్వం..గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిన అనంతరం మండల స్థాయి అధికారులకు ఆ తర్వాత జిల్లా కలెక్టర్లకు చేరుతోంది. లబ్ధిదారుల ఎంపిక అనంతరం జాబితా గ్రామ సచివాలయాల్లో చూపిస్తారు.

ఈ పథకం కింద రుణం పొందిన వారు నెలసరివాయిదాల్లో నగదును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తైంది. ఈ ఏడాది మొదట్లో ఈ పథకం కోసం వివరాలు సేకరించినా పథకం అమలు ఆలస్యమైంది..కాగా, మరి కొన్ని పథకాలకు త్వరలోనే స్వీకారం చుట్టనుంది.ఇకపోతే వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద చేనేత కుటుంబాలకు రూ.24వేల చొప్పున ఆర్ధిక సాయం చేయనుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను కూడా ప్రభుత్వం చేపట్టింది. త్వరలోనే ఈ పథకం కూడా అమలు కానుంది..

Read more RELATED
Recommended to you

Latest news