తెలుగు విషయానికి వస్తే.. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తయింది. రెండు సీజన్లు కూడా బుల్లి తెర అభిమానులను అలరించాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ సీజన్ కంటే రెండో సీజన్ కాస్త చప్పగా ఉందని అన్నారు.
బిగ్ బాస్.. బుల్లి తెర సంచలనం. తెలుగు ప్రజలకు బిగ్ బాస్ గురించి ఓ సంవత్సరం నుంచి తెలుసు కాబోలు కానీ… హిందీలో బిగ్ బాస్ షో ఇప్పటికే 10 షోలకు పైనే పూర్తి చేసుకుంది. అన్ని షోలకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖానే హోస్ట్. ప్రతి సీజన్ అక్కడ సక్సెసే. అందుకే.. దాన్ని ఇన్సిపిరేషన్ గా తీసుకొని తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో ఈ షోను స్టార్ట్ చేశారు. అన్ని భాషల్లోనూ అది సక్సెస్ అయింది.
తెలుగు విషయానికి వస్తే.. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తయింది. రెండు సీజన్లు కూడా బుల్లి తెర అభిమానులను అలరించాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ సీజన్ కంటే రెండో సీజన్ కాస్త చప్పగా ఉందని అన్నారు.
ఫస్ట్ సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉండగా… రెండో సీజన్ కు నాని హోస్ట్ గా ఉన్నారు. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కు 70 రోజుల గడువు పెట్టారు. 16 మంది హౌజ్ మేట్స్. రెండో సీజన్ కు మాత్రం 112 రోజుల గడువును పెట్టారు. హౌజ్ మేట్స్ ను 18 మందిని తీసుకున్నారు. మరి.. మూడో సీజన్ కు ఎంత మందిని తీసుకుంటారు.. ఎన్ని రోజులు బిగ్ బాస్ హౌజ్ లో ఉండాలి అనే విషయం తెలియనప్పటికీ.. బిగ్ బాస్ సీజన్ 3 కోసం ఇప్పటికే కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసుకున్నారట నిర్వాహకులు. ఇప్పటికే సీజన్ 3 హోస్ట్ గా టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
ఇక.. సీజన్ 3 లో ఉండబోయే కంటెస్టెంట్లు ఎవరంటే..
బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, యాంకర్ ఉదయభాను, యూట్యూబ్ స్టార్ మహాతల్లి, నటుడు జాకీ, నటుడు కమల్ కామరాజ్, నటి గాయత్రీ గుప్తా, యాంకర్ సావిత్రి, మోడల్ సింధూర గద్దే, జబర్దస్త్ ఫేం పొట్టి గణేశ్, సింగర్ హేమచంద్ర, డ్యాన్స్ మాస్టర్ రఘు కంటెస్టెంట్లుగా సెలెక్ట్ అయ్యారట.
మరోవైపు హౌజ్ లోకి సర్ ప్రైజ్ స్టార్స్ గా పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అడుగుపెట్టనున్నారట.
ఇక వచ్చే నెలలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నదట బిగ్ బాస్ సీజన్ 3. దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా త్వరలోనే మాటీవీలో టెలికాస్ట్ చేస్తారని తెలుస్తోంది.