ఫస్ట్ టైమ్ హాస్పిటల్ బెడ్ ఎక్కిన జూనియర్ ఐష్

-

ముందు సాధారణంగానే ఉన్న జ్వరం తర్వాత ఎక్కువ కావడంతో అది వైరల్ ఫీవర్ గా మారిందట. దీంతో హాస్పిటల్ లో చేరాల్సి వచ్చిందట. ప్రస్తుతం ఆమె బెడ్ మీద ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జూనియర్ ఐష్ తెలుసా మీకు. అచ్చం ఐశ్వర్యారాయ్ లా ఉండే స్నేహా ఉల్లాల్ గురించే మనం మాట్లాడుకునేది. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహా ఉల్లాల్… బాలకృష్ణ సింహా సినిమాలోనూ నటించింది. తన చివరి సినిమా మడత కాజా. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లోనూ నటించింది. ఆ తర్వాత తెరపై కనుమరుగైంది.

ఇదిగో మళ్లీ ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ప్రత్యక్షమైంది స్నేహ. తను ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో బాధపడుతోందట. ఫస్ట్ టైమ్ హాస్పిటల్ బెడ్ ఎక్కానని స్నేహ చెబుతోంది.

ముందు సాధారణంగానే ఉన్న జ్వరం తర్వాత ఎక్కువ కావడంతో అది వైరల్ ఫీవర్ గా మారిందట. దీంతో హాస్పిటల్ లో చేరాల్సి వచ్చిందట. ప్రస్తుతం ఆమె బెడ్ మీద ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news