పాక్ క్రికెట్ అభిమానులూ.. మీ జ‌ట్టుకంత సీన్ లేదు.. కొంచెం త‌గ్గించండి..!

-

భార‌త జ‌ట్టు గెలిచినా, ఓడినా దేశ విదేశాల్లో ఉన్న క్రికెట్ అభిమానులు మాత్రం ప్లేయ‌ర్ల‌కు అండ‌గానే ఉంటారు. అంతేకానీ.. పాక్ క్రికెట్ అభిమానుల్లా క‌ల్లు తాగిన కోతుల‌లా ఎప్పుడూ ప్ర‌వ‌ర్తించ‌లేదు.

ఇల్లు అలికినంత మాత్రాన పండ‌గవుతుందా..? కాదు క‌దా.. కానీ ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు అదే ఫీల‌వుతున్నారు. ఒక్క మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి గెలిచినందుకు త‌మ టీంను పొగుడుతూ సంబ‌రాలు చేసుకుంటున్నారు. అయితే అది కరెక్టే. త‌మ దేశం గెలిస్తే ఆ దేశ పౌరులు ఎవరైనా ఆ గెలుపును ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. అంతేకానీ.. మ‌రొక టీం శ‌క్తిని మాత్రం అంత త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కూడ‌దు క‌దా.. కానీ.. పాక్ క్రికెట్ అభిమానులు మాత్రం అదే చేస్తున్నారు. భార‌త క్రికెట్ ప‌వ‌ర్‌ను చాలా తేలిగ్గా చేసి మాట్లాడ‌డ‌మే కాదు, మ‌న దేశ ప్లేయ‌ర్లు, క్రికెట్ అభిమానుల‌పై నెట్టింట్లో విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు.

ఇంగ్లండ్‌తో నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ గెల‌వ‌డం ఏమో గానీ.. ఆ దేశ క్రికెట్ అభిమానులకు ముడ్డిపై గుడ్డ నిల‌వ‌డం లేదు. త‌మ జ‌ట్టును కీర్తిస్తూ.. త‌మ ప్లేయ‌ర్లు అద‌రహో.. అంటూ.. నెట్‌లో ట్వీట్ల ద్వారా పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మ‌రోవైపు ఇండియ‌న్ క్రికెట్ ప్లేయ‌ర్ల‌పై, క్రికెట్ అభిమానుల‌పై విమ‌ర్శ‌నాత్మ‌క‌మైన‌.. ఒక ర‌కంగా చెప్పాలంటే.. తిడుతూ.. ట్వీట్లు పెడుతున్నారు. ఇండియ‌న్ ప్లేయ‌ర్లు, క్రికెట్ అభిమానుల‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇరు దేశాల‌కు చెందిన క్రికెట్ అభిమానుల మ‌ధ్య సోష‌ల్ మీడియాలో కోల్డ్ వార్ న‌డుస్తోంది.

అయితే నిజానికి పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు త‌మ జ‌ట్టు విజయం ప‌ట్ల పొంగిపోవ‌డంలో అర్థం లేదు. ఎందుకంటే.. అస‌లు ప్ర‌పంచంలోని క్రికెట్ ఆడే దేశాల్లో అత్యంత నిల‌క‌డ లేని జ‌ట్టు ఏదైనా ఉందంటే.. అది పాకిస్థానే.. ఆ జ‌ట్టు ప్లేయ‌ర్లు ఎప్పుడు ఎలా ఆడుతారో ఎవ‌రికీ తెలియ‌దు. వ‌ర‌ల్డ్ క‌ప్ ఆరంభంలోనే మ‌నం చూశాం. విండీస్ చేతిలో పాక్ దారుణ ప‌రాజ‌యం పాలైంది. మ‌ర‌ప్పుడు పాక్ క్రికెట్ అభిమానుల పొగ‌డ్త‌లు ఏమ‌య్యాయి ? అభిమానం అంటే ఎప్పుడూ ఒకే ర‌కంగా ఉండాలి. అంతేకానీ గెలిస్తే ఒక‌లా, ఓడితే మ‌రొక‌లా ఉండ‌కూడ‌దు.

భార‌త జ‌ట్టు గెలిచినా, ఓడినా దేశ విదేశాల్లో ఉన్న క్రికెట్ అభిమానులు మాత్రం ప్లేయ‌ర్ల‌కు అండ‌గానే ఉంటారు. అంతేకానీ.. పాక్ క్రికెట్ అభిమానుల్లా క‌ల్లు తాగిన కోతుల‌లా ఎప్పుడూ ప్ర‌వ‌ర్తించ‌లేదు. ఓడితే స‌హ‌జంగానే బాధ ఉంటుంది.. అంత మాత్రం చేత పూర్తిగా క్రికెట్ అభిమానాన్ని మాత్రం ఏ భార‌త అభిమాని వ‌దులుకోలేదు. పాక్ క్రికెట్ అభిమానుల్లా భార‌త అభిమానులు ప్ర‌వ‌ర్తించ‌లేదు. కేవ‌లం ఒక్క మ్యాచ్‌లో గెలిస్తేనే.. పాక్ అభిమానులు ఇంత సంబ‌ర ప‌డిపోతున్నారు.. ఇప్పుడే వ‌ర‌ల్డ్ క‌ప్ అయిపోలేదు క‌దా.. ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌. అప్పుడు చూద్దాంలే.. ఎవ‌రు గెలుస్తారో, ఎవ‌రు ఓడుతారో.. అప్ప‌టి వ‌ర‌కు మీ ట్వీట్ల‌ను దాచి పెట్టుకోండి. అన‌వ‌స‌రంగా విమ‌ర్శ‌లు చేయ‌కండి. జోకులు పేల్చ‌కండి.. ఎవ‌రి తాహతు ఎంతో చివ‌రికి తెలిశాక అప్పుడు పోస్టులు పెట్టండి. అంతేకానీ.. సోష‌ల్ మీడియాలో ఇలా చిల్ల‌ర వేషాలు వేయ‌కండి.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మ‌స‌లుకోండి.. లేక‌పోతే భార‌త జ‌ట్టు ఇచ్చే స్ట్రోక్‌కు మీరు త‌ట్టుకోలేరు.. జాగ్ర‌త్త‌..!

Read more RELATED
Recommended to you

Latest news