ఇంటర్వూలో ఈ ప్రశ్నలు అడిగితే చట్టరిత్యా నేరమట..? కనీసం ఏజ్‌ కూడా అడగొద్దు..!

-

ఇంటర్వూ ఉందంటే.. మనం ఆ జాబ్‌కు తగ్గట్టు ఏవేవో ప్రిపేర్‌ అవుతాం.. కానీ వాళ్లు ముందు మన మైండ్‌లో ఉన్నదంతా డైవర్ట్‌ చేయడానికే అన్నట్లు..అసలు సబ్జెక్టు సంబంధం లేని ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వూలో అడిగే ప్రశ్నలకు కూడా నియమనిబంధనలు ఉన్నాయని చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అమెరికాలో ఇంటర్వూలో ఏది పడితే అది అడగకూడదు.. అలా అడిగారంటే..తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఇంతకీ ఆ అడగకూడని ప్రశ్నలేంటి..? ఇవి మీకు కచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. వీటిల్లో కొన్ని మన దగ్గర కామన్‌గా అడిగేస్తుంటారు..!

అమెరికన్ ఫెడరల్ లా ప్రకారం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తే దానిని చట్టరీత్యా నేరంగా భావిస్తారు. అయితే ఈ విషయాలపై చాలా మందికి అవగాహన లేదు. ఒకవేళ కనుక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేస్తే వ్యక్తి ఈ ప్రశ్నలు అడిగితే ఇంటర్వ్యూకి వెళ్లిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చెయ్యచ్చు.

1. పెళ్లి అయ్యిందా లేదా?:

పెళ్ళికి సంబందించిన అంశాలని అడగకూడదు. ఇంటర్వ్యూ సమయంలో ఎవరిని కూడా వారి వైవాహిక జీవితం గురించి ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు. ఇలా అడగడం అమెరికాలో చట్టరీత్యా నేరం.

2. మతానికి సంబంధించిన ప్రశ్నలు:

ఇంటర్వ్యూ సమయంలో మీరు ఏ మతం అని అడగకూడదు. ఇది కూడా చట్ట రీత్యా నేరంగానే పరిగణించబడుతుంది..

3. అమెరికా పౌరులు ఏనా:

పౌరసత్వం, ఇమిగ్రేషన్‌ని తీసుకుని ఉద్యోగిపై వివక్ష చూపకూడదు. ICRA ప్రకారం.. ఇది నేరం. ఇంటర్వ్యూ సమయంలో ఈ ప్రశ్న అడగకూడదు. కానీ తర్వాత ఇన్‌ఫార్మల్‌గా అడగొచ్చు.

4. మీరు గర్భవతా?:

గర్భధారణ స్థితికి సంబంధించి ప్రశ్నలు కూడా ఇంటర్వూలో అడగకూడదు. ప్రెగ్నెన్సీ డిస్క్రిమినేషన్ యాక్ట్ 1978 ప్రకారం కూడా మహిళని గర్భవత అని అడగకూడదు. అలానే గర్భవతి అవడం వల్ల ఉద్యోగం నుంచి తీయకూడదు. ఒక వ్యక్తి ప్రెగ్నెన్సీ లీవ్స్ తీసుకుంటే అప్పుడు మాత్రమే ఆ విషయాన్ని అడగాలి.

5. అభ్యర్థి వయసు:

అమెరికాలో ఏ ఇంటర్వ్యూలో కూడా 40 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళని వయసు ఎంత అని అడగరు. అలాగే వయసుకు సంబంధించిన ప్రశ్నలు కూడా తీసుకురారు. 1967ADEA చట్టం ప్రకారం వ్యక్తి యొక్క వయసుకు సంబంధించిన ప్రశ్నలు అడగడం చట్టరీత్యా నేరం. అయితే ఎక్కువగా కంపెనీలో యువకులకు ప్రాధాన్యత ఇస్తారని.. అలాంటి పక్షపాత ధోరణి కలగకుండా ఉండటానికి దీనిని తీసుకువచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news