తొలిసారిగా ఒకే వ్యక్తిలో మంకీపాక్స్, కరోనా వైరస్ గుర్తింపు

-

ఒక వైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని హడలెత్తిస్తుంటే.. మరోసారి వైపు మంకీపాక్స్ వైరస్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వైరస్ సోకిన వారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికే కరోనా, మంకీపాక్స్ వైరస్ సోకుతోందని డబ్ల్యూహెచ్ఓ అధికారులు వెల్లడించారు. అయితే తాజాగా ఒకే వ్యక్తిలో మంకీపాక్స్, కరోనా వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తిలో రెండు వైరస్‌లను గుర్తించారు. ఇలా ఒకే వ్యక్తి రెండు వైరస్‌లను గుర్తించడం ఇదే మొదటిసారి.

కరోనా వైరస్-మంకీపాక్స్
కరోనా వైరస్-మంకీపాక్స్

కాలిఫోర్నియాకు చెందిన మిట్కో థాంప్సన్‌కు జూన్‌లో కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత కొద్దిరోజులకు శరీరంపై బొబ్బలు రావడం మొదలయ్యాయి. దీంతో పరీక్షలు నిర్వహించుకున్న మిట్కో థాంప్సన్‌కు మంకీపాక్స్ నిర్ధారణ అయింది. కాగా, అమెరికాలో ఇప్పటివరకు 2,400 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. 71 దేశాల్లో దాదాపు 16 వేల మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. అమెరికాలో ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. జులై 19వ తేదీన అత్యధికంగా 1.7 లక్షల కేసులు నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news