లక్ష్మీదేవికి ఈ పూలతో పూజ చేస్తే అప్పుల బాధ నుంచి విముక్తి పొందవచ్చు..

-

చెట్లు,మొక్కలను పూజిస్తారు..ఎందుకంటే అక్కడ దేవతలు నివాసం ఉంటారని ప్రజల విశ్వాసం..అయితే మోదుగ చెట్టు చాలా ప్రవిత్రమైనదిగా భావిస్తారు..శాస్త్రం ప్రకారం ఆ చెట్టులో బ్రహ్మ, విష్ణు , మహేశ్వరులు నివసిస్తున్నారు. మోదుగ పువ్వులు లక్ష్మీదేవికి ఇష్టమైన పూలు. మోదుగ పూలు చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంతే ఉపయోగకరంగా ఉంటాయి..ఈ మోదుగ పూల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

శుక్రవారం నాడు మోదుగ చెట్టు లేదా మొక్కను పూజించాలి. ఇది తల్లి లక్ష్మితో పాటు బ్రహ్మ, విష్ణు , మహేశ్వరుల అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది , ముఖ్యంగా పూర్వ ఫాల్గుణి నక్షత్రంలో జన్మించిన వారు ఈ రోజున రెట్టింపు శుభ ఫలాలను ఇచ్చే మోదుగ చెట్టును పూజించాలి..

ఆరోగ్య ప్రయోజనాల కోసం, పవిత్రమైన ఆదివారం నాడు మోదుగ చెట్టు వేరును ఇంటికి తీసుకురండి. అందులో కాటన్ దారాన్ని చుట్టి కుడి చేతికి కట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యాధితో బాధపడేవారికి రోగాలు త్వరగా నయమవుతాయని నమ్మకం..ఇకపోతే గురువారం రోజు పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి.
గ్రహశాంతికి మోదుగ చెట్టు ఎంతో మేలు చేస్తుంది. మోదుగ వృక్షంతో కూడిన హవనం కుండలిలోని గ్రహదోషాన్ని తొలగించి అన్ని కార్యాలను పూర్తి చేస్తుంది..

ఇకపోతే..మోదుగ పువ్వులు, గులాబీ పువ్వులు లేదా మల్లెపూలు , తులసి ఆకులను తీసుకుని, వాటిని మీ స్నానపు నీటిలో వేసి స్నానం చేయండి. ఇది తొమ్మిది గ్రహాల ప్రభావాన్ని తొలగిస్తుంది. ఇలా 42 రోజులు చేయాలి.బ్రహ్మ, విష్ణు , మహేశ్వరులు మోదుగలో నివసిస్తున్నారని నమ్ముతారు, ఇది పూజా కార్యక్రమాలలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది..ఇది గ్రహ శాంతితో పాటు సకల దోషాలను కూడా తొలగిస్తుంది..అందుకే పండితులు మోదుగ పూలను ప్రత్యేకంగా చూస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news