ప్లేయర్ల వయసును గుర్తించే కొత్త సాఫ్ట్‌ వేర్.. బీసీసీఐ కీలక నిర్ణయం

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. అయితే ఇటీవల చాలా మంది ప్లేయర్లు తమ వయసును దాచిపెడుతున్నారు. ఎక్కువ వయసు ఉన్నా.. తక్కువ వయసు చూపించి గేమ్స్ లో ఆడుతున్నారు. దీంతో ఆటగాళ్ల వయసును తెలుసుకునేందుకు బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో బీసీసీఐ కొత్త సాఫ్ట్ వేర్‌ను తీసుకొచ్చింది. అయితే గతంలో బీసీసీఐ టీడబ్ల్యూ3 పద్ధతిలో వయసు నిర్ధారణ చేస్తున్నారు.

బీసీసీఐ
బీసీసీఐ

అయితే ఈ పద్ధతిలో వయసును పూర్తి స్థాయిలో కనుగొనడానికి నెల రోజులపాటు సమయం పడుతుండేది. దీంతో చాలా వరకు టైం వృధా అవుతుంది. ఈ పరీక్ష నిర్వహించడానికి రూ.2,400 ఖర్చు అవుతుంది. అయితే ‘బోన్ ఎక్స్ పర్ట్ సాఫ్ట్ వేర్’ వల్ల ఈజీగా వయసు గుర్తించడంతోపాటు అతి తక్కువ సమయంలో రిపోర్టులు పొందవచ్చు. ఈ సాఫ్ట్ వేర్ వల్ల 80 శాతం ఖర్చు ఆదా అవుతుందని బీసీసీఐ పేర్కొంది. ఈ సాఫ్ట్ వేర్‌తో రూ.288 తక్కువ ఖర్చుతో పరీక్షలు చేసుకోవచ్చు. అయితే ఈ సాఫ్ట్ వేర్‌ను బీసీసీఐ ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించనుంది.