టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య పై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ఇండియా లో జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత హార్దిక్ పాండ్యా వన్డేల నుంచి తప్పుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఆటగాళ్లు వన్డే ఫార్మాట్ కంటే టీ-20 ఫార్మాట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇక టెస్ట్ క్రికెట్ రోజురోజుకు ఆదరణ కోల్పోతుందని అన్నారు.
ఇప్పటికే ఆటగాళ్ళు వారు ఏ ఫార్మాట్లలో ఆడాలో నిర్ణయించుకున్నారని, హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే అతడు ఎక్కువగా టి – 20 క్రికెట్ ఆడాలని అనుకుంటున్నట్లు తెలిపారు. వన్డే ప్రపంచకప్ తర్వాత హార్దిక్ పాండ్యా వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పవచ్చు అని, జట్టులో మరికొంతమంది ఆటగాళ్లు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు రవిశాస్త్రి.